నిఖిల్ నక్క తోక తొక్కినట్లున్నాడే..

నిఖిల్ నక్క తోక తొక్కినట్లున్నాడే..

‘స్వామి రారా’తో యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్ మలుపు తిరిగింది. సక్సెస్ రావడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు పెట్టుకుని.. ‘స్వామి రారా’ తర్వాత జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ.. సినిమా సినిమాకూ తన స్థాయి పెంచుకుంటూ సాగిపోతున్నాడు నిఖిల్. మధ్యలో ‘శంకరాభరణం’ రూపంలో ఎదురు దెబ్బ తగిలినా.. మళ్లీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో పుంజుకున్నాడు. ఇప్పుడు ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్ వర్మతో నిఖిల్ చేసిన ‘కేశవ’ అతడి కెరీర్లోనే అత్యధిక అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో నిఖిల్‌ను అదృష్టం బాగానే కలిసొచ్చింది.

సమ్మర్ సీజన్లో.. అది కూడా మే నెలలో పోటీయే లేకుండా సినిమాను రిలీజ్ చేసుకోగలగడం అంటే చిన్న విషయం. భారీ సినిమాలకు మాత్రమే ఇలాంటి అవకాశం దొరుకుతుంది. పెద్ద సినిమాలకు పోటీ వెళ్లడానికి వేరే సినిమాల వాళ్లు భయపడతారు కాబట్టి అవి మాత్రమే సోలోగా రిలీజవుతాయి. ‘కేశవ’ లాంటి సినిమాకైతే మామూలుగా పోటీ ఉండాలి. ఈ వారం ‘రాధ’కు పోటీగా ఇంకో రెండు సినిమాలొచ్చాయి. కానీ ‘కేశవ’కు అలాంటి ఇబ్బందేమీ లేదు. 19న రావాల్సిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ 26కు వాయిదా పడిపోయింది.

గోపీచంద్ మూవీ ‘ఆరడుగుల బుల్లెట్’ కూడా వెనక్కి వెళ్లింది. ఈ వారం వచ్చిన ‘రాధ’కు కొంచెం డివైడ్ టాక్ ఉంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నా రెండో వారానికి జోరు తగ్గించే అవకాశముంది. ‘బాహుబలి-2’ కూడా అప్పటికి కొంచెం శాంతించే అవకాశముంది. ఈ అడ్వాంటేజీని ‘కేశవ’ ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుందో కానీ.. దానికి గ్రౌండ్ మాత్రం బాగా రెడీ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు