దేశానికి ఇప్పుడేం కావాలో చెప్పిన జ‌క్క‌న్న‌

దేశానికి ఇప్పుడేం కావాలో చెప్పిన జ‌క్క‌న్న‌

బాహుబ‌లి 2 చిత్రం త‌ర్వాత ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రేంజ్ ఎంత‌గా మారిపోయిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇప్పుడాయ‌న కోసం స్టార్ హీరోలంతా క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆయ‌న నోటి నుంచి ఓకే అన్న మాట వ‌స్తే చాల‌న్న‌ట్లుగా ప‌రిస్థితి ఉంది. మొన్నామ‌ధ్య‌న బాహుబ‌లితో త‌న జ‌ర్నీ ముగిసింద‌ని ట్వీట్ చేసిన ఆయ‌న‌.. ఆ చిత్ర ప్ర‌మోష‌న్ వ‌ర్క్‌ను వ‌దిలేసినా.. ఆ సినిమా ఆలోచ‌న‌ల నుంచి మాత్రం బ‌య‌ట‌కు రావ‌టం లేద‌నే చెప్పాలి.

తాజాగా విశాఖ‌లోని జ‌గ్గ‌రాజుపేట గ్రీన్ సిటీలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని ప్రారంభించిన జ‌క్క‌న్న‌.. త‌ర్వాత మాట్లాడుతూ.. ఇప్పుడు వివిధ రంగాల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన వారిని బాహుబ‌లి అంటున్నారంటూ చెప్పుకొచ్చారు.  విశేష ప్ర‌తిభ చూపిన వారిని బాహుబ‌లి పేరుతో గౌర‌వించ‌టంగా మారింద‌న్న ఆయ‌న‌.. దేశానికేం కావాలో చెప్పుకొచ్చారు.

దేశంలో ద్రోణాచార్యులు చాలామందే ఉన్నార‌ని.. కానీ అర్జునులు మాత్రం క‌నిపించ‌టం లేద‌న్నారు. ల‌క్ష్యాన్ని మాత్ర‌మే చూసే అర్జునులు కావాల‌ని చెప్పిన జ‌క్క‌న్న‌.. ఏం క‌నిపిస్తోంద‌న్న ద్రోణాచార్యుల వారి ప్ర‌శ్న‌కు అర్జునుడు బ‌దులిస్తూ.. ప‌క్షి క‌న్ను మాత్ర‌మే క‌నిపించింద‌ని చెప్పార‌ని.. అదే తీరులో ల‌క్ష్యాన్ని మాత్ర‌మే చూసే అర్జునులు కావాల‌న్నారు. ఇప్పుడు అలాంటి వారేదేశానికి చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. ఒక‌ప్పుడు తాను విశాఖ‌లోనే  సాగ‌ర్ న‌గ‌ర్ లో ఉండేవాడిన‌ని..  చెప్పిన రాజ‌మౌళి.. నాటి ముచ్చ‌ట్ల‌ను గుర్తు చేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు