చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

బాహుబలితో తెలుగు సినిమా రికార్డులు బద్దలైతే అదేమంత న్యూస్‌ కాదు. బాహుబలి అన్ని వెర్షన్లకీ వచ్చిన కలక్షన్లతో ఇండియన్‌ సినిమా రికార్డ్‌ స్థాపిస్తే అదేమంత సర్‌ప్రైజ్‌ కాదు. కానీ కేవలం హిందీ వెర్షన్‌తో, అది కూడా డబ్డ్‌ వెర్షన్‌తో హిందీ చిత్ర చరిత్రలో ఇండియాలో తొలిసారిగా నాలుగు వందల కోట్ల వసూళ్లు సాధించిన రికార్డ్‌ బాహుబలి కైవసమైంది.

ఇది బాహుబలి సాధించిన అన్ని రికార్డుల కంటే ఉత్తమమని, అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ వల్ల కూడా కాని ఫీట్‌ని, అక్కడి బ్లాక్‌బస్టర్‌ సినిమాలు కూడా సాధించలేకపోయిన ఘనతని బాహుబలి సొంతం చేసుకుంది. ఇప్పటికీ సూపర్‌ కలక్షన్లు రాబట్టుకుంటోన్న ఈ చిత్రం అయిదు వందల కోట్ల వసూళ్లని హిందీలో సాధించడం కష్టమేం కాదనిపిస్తోంది. ఇది తెలుగు వారంతా గర్వపడాల్సిన ఘనత.

ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఇప్పుడు భారతీయ సినిమాకే తలమానికంగా నిలిచింది. బాహుబలి మొదటి భాగంతోనే ఇండియా రికార్డులన్నీ బ్రేక్‌ అయ్యాయి. అయితే అప్పుడు హిందీ వెర్షన్‌ వసూళ్లని మాత్రమే లెక్కించి మన సినిమాని అక్కడి ట్రేడ్‌ పక్కన పెట్టింది. కానీ ఈసారి ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా సరాసరి బాలీవుడ్‌ రికార్డులనే బాహుబలి బీట్‌ చేసేసి టాప్‌లో నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు