విలన్ కాదు.. ఇండస్ట్రీకి రంకు మొగుడయ్యాడు

విలన్ కాదు.. ఇండస్ట్రీకి రంకు మొగుడయ్యాడు

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ మరే హీరో అందుకోలేని స్థాయికి చేరుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎదుగుదల ఎంతోమందికి ఆదర్శం. చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చే నాటికి ఇండస్ట్రీలో పేరున్న హీరోలుగా ఉన్న తమకు సైతం చిరంజీవి ఆదర్శంగా నిలిచాడని.. ఆయన్ని చూసి తామెంతో నేర్చుకున్నామని.. తమను తాము మార్చుకున్నామని అంటున్నాడు సీనియర్ నటుడు మురళీ మోహన్. తాజాగా ఆలీ నిర్వహించే ఒక టాక్ షోలో ఆయన చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘చిరంజీవి నటుడిగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో నన్నోసారి కలిశాడు. నా సినిమా ఒకటి అప్పట్లో బాగా ఆడుతుంటే.. దాని గురించి ప్రస్తావిస్తూ తన సినిమాకు కూడా అలా జనాలు వస్తారంటారా అని అడిగాడు. ఇంతకంటే బాగా వస్తారయ్యా.. నీలో మంచి టాలెంట్ ఉంది అన్నాను.

ఆ తర్వాత కృష్ణంరాజు గారు నేను.. కలిసి చిరంజీవి గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. చిరంజీవి రాబోయే రోజుల్లో పెద్ద యాక్టర్ అవుతాడని.. మంచి కళ్లున్నాయని.. విలన్ గా గొప్ప పేరు తెచ్చుకుంటాడని అన్నారు కృష్ణం రాజు గారు. కానీ విలన్ కాదు.. ఇండస్ట్రీకి రంకు మొగుడయ్యాడు. చిరంజీవి ఇండస్ట్రీలో చాలా మార్పులు తీసుకొచ్చాడు. మేం అప్పటిదాకా ఫైటింగ్ అంటే చేతులు ఊపుతూ ఏదో చేసేవాళ్లం. డ్యాన్స్ కూడా అంతే. కానీ చిరంజీవి వచ్చి రియల్ ఫైటింగ్స్ చేశాడు. డ్యాన్సులు కూడా చాలా బాగా చేశాడు. అతనలా చేసిన తర్వాత మేమందరం కూడా అలా చేయాల్సి వచ్చింది. మమ్మల్ని మేం మార్చుకోవాల్సి వచ్చింది’’ అని మురళీ మోహన్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు