ఇండియాలోనే వెయ్యి కోట్లొచ్చాయి

ఇండియాలోనే వెయ్యి కోట్లొచ్చాయి

విడుదలైన తొలి రోజు నుంచి ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రకంపనలు రేపుతూ సాగిపోతోంది. ఇప్పటికే ఇండియన్ సినిమా కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. రోజుకో కొత్త మైలురాయిని అందుకుంటూ దూసుకెళ్తోందీ సినిమా.

వరల్డ్ వైడ్ రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ మూవీగా తొలి వారంలోనే ‘బాహుబలి-2’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. విశేషం ఏంటంటే.. ఇప్పుడీ సినిమా ఇండియా వరకే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ‘బాహుబలి’ నాలుగు భాషల వసూళ్లు కలిపి ఇండియాలోనే రూ.1000 కోట్ల గ్రాస్ మార్కును దాటేశాయి.

ఇందులో తెలుగు వెర్షన్ మాత్రమే రూ.300 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. హిందీ వెర్షన్ వసూళ్లు రూ.400 కోట్లు దాటాయి. తమిళం.. మలయాళం కూడా కలిపి రూ.1000 కోట్ల గ్రాస్ పూర్తయింది. ‘బాహుబలి-2’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1300 కోట్ల మార్కుకు చేరువగా ఉన్నాయి. ఈ వీకెండ్లో వంద కోట్లయినా జమ అవుతాయని భావిస్తున్నారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1500 కోట్ల మైలురాయిని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పుడిప్పుడే ఈ రికార్డు బద్దలవడం కష్టమే. కేవలం అమెరికాలో మాత్రమే ‘బాహుబలి-2’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. లండన్.. దుబాయ్ లాంటి చోట్ల కూడా బాహుబలి-2 వసూళ్లు అనూహ్యంగా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు