బాహుబలి-2 సరికొత్త మైలురాయి

బాహుబలి-2 సరికొత్త మైలురాయి

రెండో వీకెండ్ అయ్యాక ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభంజనం కొనసాగుతోంది. వీక్ డేస్‌లో సైతం స్ట్రాంగ్‌గా సాగిపోతోందీ సినిమా. వరల్డ్ వైడ్ ఈ సినిమా కలెక్షన్లు రూ.1300 కోట్ల మార్కుకు అత్యంత చేరువగా ఉన్నాయి. ఈ వారాంతం అయ్యేసరికి రూ.1400 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఒక ఇండియన్ సినిమా గురించి ఇలాంటి అంకెలతో చర్చించకుంటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘బాహుబలి-2’ కనీ వినీ ఎరుగని ఫిగర్స్ నమోదు చేస్తోంది. సెకండ్ వీకెండ్ అయ్యేసరికే ‘బాహుబలి: ది బిగినింగ్’ కలెక్షన్లను దాటేసిన ఈ సినిమా.. ఇప్పుడు వసూళ్లలో కొత్త మైలురాయిని టచ్ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 వసూళ్లు రూ.150 కోట్ల షేర్ మార్కును దాటేశాయి. 12 రోజుల్లో ఈ చిత్రం రూ.151.36 కోట్ల షేర్ సాధించడం విశేషం. ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా రూ.50.10 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇక్కడ ఇంకో పది కోట్ల షేర్ గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో సరిగ్గా రూ.20 కోట్ల షేర్ వసూలైంది. ఈ ఏరియాలో ఇంకో ఐదు కోట్లేసుకోవచ్చేమో. సీడెడ్లో రూ.26.37 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.14.06 కోట్లు.. పశ్చిమగోదావరిలో రూ.10.34 కోట్లు.. కృష్ణా జిల్లాలో రూ.10.72 కోట్లు.. గుంటూరులో రూ.14.2 కోట్లు.. నెల్లూరులో రూ.5.65 కోట్లు షేర్ వసూలు చేసింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బయ్యర్లు లాభాల బాట పట్టగా.. ఇంకొన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ మార్కును టచ్ చేశారు. ఫుల్ రన్లో అందరికీ లాభాలు గ్యారెంటీ అన్నమాటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు