రెండో రఘువరన్.. వచ్చేస్తున్నాడు

రెండో రఘువరన్.. వచ్చేస్తున్నాడు

తెలుగులో మార్కెట్ సంపాదించుకోవాలని చాలా ఏళ్ల పాటు ప్రయత్నం చేశాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ఐతే అతణ్ని చాన్నాళ్ల పాటు మన జనాలు పట్టించుకోలేదు. చివరికి రెండేళ్ల కిందట ‘రఘువరన్ బీటెక్’ అతడి కోరిక నెరవేర్చింది.

పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అనూహ్యంగా పెద్ద సక్సెస్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన స్రవంతి రవికిషోర్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్లలో కంటే కూడా టీవీల్లో ఈ సినిమా సూపర్ హిట్టయింది. మా టీవీలో ఎప్పుడు ప్రసారమైనా దీనికి మంచి ఆదరణ ఉంటోంది. ఇందులో హీరో క్యారెక్టర్.. మదర్ సెంటిమెంట్.. మ్యూజిక్.. అన్నీ కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

‘రఘువరన్ బీటెక్’ తర్వాత ధనుష్ సినిమాలు నాలుగైదు రిలీజయ్యాయి కానీ.. అవేవీ మన ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ ధనుష్‌ను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయగలిగేది ‘రఘువరన్ బీటెక్’ సీక్వెలే అని భావిస్తున్నారు. ‘వీఐపీ-2’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. జులై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదే రోజు ‘వీఐపీ-2’ పేరుతోనే తెలుగులోనూ రిలీజ్ చేస్తారట. ‘వీఐపీ’ తీసింది వేల్ రాజ్ కాగా.. సీక్వెల్ కు ధనుష్ మరదలు సౌందర్య రజినీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ధనుష్ కథ అందించాడు. ‘కబాలి’ నిర్మాత కలైపులి థాను నిర్మించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కాజోల్ కీలక పాత్ర పోషించింది. వీఐపీ-2కు కాజోల్ క్యారెక్టరే హైలైట్ అని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు