లావ‌ణ్య ఇలా రెచ్చిపోయిందేంటి?

లావ‌ణ్య ఇలా రెచ్చిపోయిందేంటి?

కొంద‌రు హీరోయిన్ల‌ను చూడ‌గానే హాట్ అనిపిస్తారు. ఇంకొంద‌రు క్యూట్ అనిపిస్తారు. లావ‌ణ్య త్రిపాఠి రెండో కోవ‌కు చెందే హీరోయిన్. తొలి సినిమా ‘అందాల రాక్ష‌సి’ ద‌గ్గ‌ర్నుంచి అందంగానే క‌నిపిస్తూ వ‌స్తోంది లావ‌ణ్య‌. తొలి సినిమా ఇమేజే త‌ర్వాత కూడా కొన‌సాగింది. ప‌ద్ధ‌తైన క్యారెక్ట‌ర్లే ఆమె చేతికి వ‌చ్చాయి. కొన్ని సినిమాల్లో కొంచెం గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింది కానీ.. ఎక్స్‌పోజింగ్ అయితే చేసింది లేదు. చాలా వ‌ర‌కు హ‌ద్దుల్లోనే ఉంటూ వ‌చ్చింది.

కానీ ‘రాధ’ సినిమాకు వచ్చేస‌రికి రూటు మార్చిన‌ట్లుంది లావ‌ణ్య‌. ఈ సినిమా ప్రోమోల్లో లావ‌ణ్య షాకింగ్ లుక్స్ లో ద‌ర్శ‌న‌మిస్తోంది. ముఖ్యంగా లేటెస్టుగా రిలీజ్ చేసిన ర్యాబిట్ పిల్లా.. సాంగ్ ప్రోమోలో లావ‌ణ్య లుక్ చూసి కుర్రాళ్ల‌కు మ‌తిపోతోంది. ఇందులో లావ‌ణ్య సెక్సీ డ్రెస్సుల్లో క్లీవేజ్ షో చేస్తూ కిక్కిస్తోంది. కొంద‌రు సెక్సీ హీరోయిన్ల‌తో పోలిస్తే లావ‌ణ్య డోస్ త‌క్కువే కానీ.. ఆమె ఇంత‌కుముందెన్న‌డూ ఈ మాత్రం కూడా రెచ్చిపోయింది లేదు.

ఎప్పుడూ ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తే కెరీర్లో ఎద‌గ‌డం క‌ష్ట‌మ‌ని గుర్తించి డోస్ పెంచిన‌ట్లుంది అందాల రాక్ష‌సి. లో బ‌జ్ మ‌ధ్య రిలీజ‌వుతున్న ‘రాధ‌’కు లావ‌ణ్య అందాలు క‌చ్చితంగా ఆక‌ర్ష‌ణ అవుతాయ‌ని భావిస్తున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English