మహేష్‌ స్పైడర్‌ దసరాకి కూడా డౌటే!

మహేష్‌ స్పైడర్‌ దసరాకి కూడా డౌటే!

మహేష్‌ 'స్పైడర్‌' పనులు అనుకున్న దాని కంటే చాలా నెమ్మదిగా ముందుకి కదులుతున్నాయి. జూన్‌ 23 నుంచి ఆగస్టుకి వాయిదా పడిన ఈ చిత్రం అప్పటికి పూర్తయ్యే అవకాశాలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి.

యాక్షన్‌ పార్ట్‌ ప్లాన్‌ చేసుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని, ఏప్రిల్‌ నెలలో కేవలం అయిదు రోజుల వర్క్‌ మాత్రమే జరిగిందని, మే నెలలోను ఇంతవరకు ప్లాన్‌ ప్రకారం షూటింగ్‌ జరగలేదని చెబుతున్నారు. జూన్‌ నెలాఖరుకి షూటింగ్‌ పూర్తి చేస్తే, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ పూర్తి చేసి ఆగస్టు నెలాఖరుకి విడుదల చేసే వీలుంటుందని, అలా జరగని పక్షంలో మరింత ఆలస్యం అవుతుందని అంటున్నారు.

ప్రస్తుత ప్రోగ్రెస్‌ చూస్తే ఇది దాదాపు అసాధ్యమనేది ఈ గాసిప్స్‌ సారాంశం. ఆగస్టు నెలాఖరుకి రాని పక్షంలో దసరా బరిలోకి స్పైడర్‌ దిగాలి. ఇప్పటికే దసరాకి పలు పెద్ద సినిమాలు క్యూ కడుతోన్న నేపథ్యంలో తమిళ, హిందీ భాషల్లోను పోటీ లేని విడుదల కోరుకుంటోన్న స్పైడర్‌ అప్పుడు రావడం కూడా అనుమానమే అనుకోవచ్చు.

ఇప్పటికే చాలా లేట్‌ అయిన ఈ చిత్రం ఫైనల్‌గా ఎప్పటికి థియేటర్లని చేరుతుందో మరి. ఇదిలావుంటే మహేష్‌ అభిమానులేమో ఈ చిత్రం స్లో మోషన్‌లో ముందుకి కదలడం పట్ల సహనం కోల్పోతూ మురుగదాస్‌పై సోషల్‌ మీడియాలో విరుచుకు పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు