సుచీ లీక్స్ మళ్లీ వస్తున్నాయా?

సుచీ లీక్స్ మళ్లీ వస్తున్నాయా?

కొన్ని నెలల కిందట కోలీవుడ్ షేకైపోయింది ‘సుచీ లీక్స్’ దెబ్బకు. సింగర్ సుచిత్ర పేరుతో రిలీజైన కొన్ని ఫొటోలు.. వీడియోలు కలకలం రేపాయి. ధనుష్.. అనిరుధ్.. సంచిత.. రానా.. త్రిష.. హన్సిక లాంటి వాళ్లకు సంబంధించిన కొన్ని ఫొటోలు వీడియోలు లీకవడం సంచలనం రేపింది.

ఈ కోవలో మరిన్ని ఫొటోలు.. వీడియోలు బయటికి వస్తాయంటూ సుచిత్ర పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి బెదిరింపులు రావడం కోలీవుడ్ వర్గాల్లో గుబులు రేపింది. అప్పట్లో లక్షల మంది నెటిజన్లు కొత్త ఫొటోలు.. వీడియోల కోసం ట్విట్టర్లో పడిగాపులు కాశారు. ఐతే వాళ్లను నిరాశకు గురి చేస్తూ ‘సుచీ లీక్స్’ ఆగిపోయాయి. కోలీవుడ్ జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఐతే ఇప్పుడు సుచీ లీక్స్ పార్ట్-2 రాబోతోందంటూ ఒక వార్త కోలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. అప్పుడు సుచిత్ర పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ మేనేజ్ చేసిన వాళ్లు మరిన్ని ఫొటోలు.. వీడియోలతో రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. వీళ్లు కోలీవుడ్ సెలబ్రెటీల్ని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ బ్యాచ్ కు ఎలా కళ్లెం వేయాలా అని కోలీవుడ్ జనాలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
సుచి లీక్స్ బయటికి వచ్చినపుడు అందరూ సింగర్ సుచిత్రనే అనుమానించారు. కానీ ఈ ఎపిసోడ్ మలుపులు తిరిగిన తీరు చూస్తే ఆమె ప్రమేయం అంతంతమాత్రమే అని.. ఒక పెద్ద బ్యాచ్ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం సుచిత్ర అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు