ఆ సింగ‌ర్ కు అమెరికాలో చేదు అనుభ‌వం

ఆ సింగ‌ర్ కు అమెరికాలో చేదు అనుభ‌వం

ప్ర‌ముఖ సింగ‌ర్‌.. డ‌బ్బింగ్ అర్టిస్ట్‌.. చిన్మ‌యి శ్రీపాద‌కు అమెరికాలో చేదు అనుభ‌వం ఎదురైంది. ప్ర‌స్తుతం ఆమె అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. మ్యూజిక్ టూర్ లో భాగంగా ఆమె అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా..  గుర్తు తెలియ‌ని కొంద‌రు దుండ‌గులు ఆమె కారును ధ్వంసం చేసి.. అందులోని వ‌స్తువుల్ని దోచుకెళ్లారు. దీనిపై చిన్మ‌యి తీవ్ర నిరాశ‌ను వ్య‌క్తం చేశారు. దేవుడా.. ద‌య‌చేసి వెళ్లి మ‌రొక‌రితో ఆడుకో అంటూ ట్వీట్ చేసిన ఆమె.. దొంగ‌త‌నానికి గురైన వ‌స్తువులు తిరిగి ల‌భిస్తాయ‌న్న ఆశ‌ను వ్య‌క్తం చేశారు.

త‌న కారులో దోపిడీ జ‌రిగింద‌న్న విష‌యాన్ని తాను తెలుసుకోవ‌టానికి ఐదు నిమిషాలు ప‌ట్టింద‌ని.. త‌న కారును దోపిడీకి గురి అవుతున్న విష‌యాన్ని గుర్తించిన‌.. ఆమె ప‌క్కింటి వ్య‌క్తి పెద్ద‌గా కేక‌లు వేయ‌టాన్ని ప్ర‌స్తావిస్తూ..మంచివారు ఇంకా భూమి మీద ఉన్నార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన చిన్మ‌య‌.. ఆ వ్య‌క్తికి థ్యాంక్స్ చెప్పారు. .

పార్కింగ్ లోఉన్న త‌న కారు ఇలా దోపిడీకి గురి కావ‌టంపై ఆమె షాక్ తిన్న‌ట్లుగా ఆమె ట్వీట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతున్నాయి. అయితే.. ఆమె ఉన్న ప్రాంతంలోఇలాంటి దోపిడీలు చాలా కామ‌న్ అంటూ అమెరిక‌న్ పోలీసులు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. అయితే.. దోపిడీకి గురైన వ‌స్తువుల్ని రిక‌వ‌రీ చేస్తామ‌న్న ఆశాభావాన్ని అక్క‌డి పోలీసులు వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. పోలీసుల తీరును ప్ర‌శంసించిన చిన్మ‌యి.. వారు చాలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించారంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి సింగ‌ర్ సెల‌బ్రిటీకి అమెరికాలో చేదు అనుభ‌వం ఎదురైంద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు