టీజ‌ర్ లాగే సినిమా కూడా ఉంటేనా..

టీజ‌ర్ లాగే సినిమా కూడా ఉంటేనా..

నారా రోహిత్ కొత్త సినిమా ‘కథలో రాజకుమారి' టీజర్ లాంచ్ అయింది. ఈ టీజర్ జనాలకు ఇన్‌స్టంట్‌గా ఎక్కేసింది. ఇంట్రెస్టింగ్ నరేషన్.. క్యూరియాసిటీ పెంచే డైలాగులు.. అందమైన విజువల్స్.. చక్కటి మ్యూజిక్.. మొత్తంగా ‘కథలో రాజకుమారి' టీజర్ జనాల్ని బాగానే ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెట్టుకునేలా చేసింది. మరి టీజర్ ఉన్నట్లే సినిమా ఉంటుందా?

ఎందుకంటే ఇలా టీజర్‌, ట్రైలర్లలో జనాల్లో అంచనాలు పెంచి.. ఆ తర్వాత తెరమీద ఆ అంచ‌నాల్ని అందుకోలేక‌పోయిన‌ సినిమాలు నారా రోహిత్ నుంచి ఇంతకుముందు కొన్ని వచ్చాయి. గత ఏడాది ఆరంభంలో నారా రోహిత్ నుంచి వచ్చిన ‘సావిత్రి', ‘రాజా చెయ్యి వేస్తే' టీజర్లు.. ట్రైలర్లు ఇలాగే చాలా ఆసక్తి రేకెత్తించాయి. కేవలం వాటిలోని డైలాగులే సినిమాలపై క్యూరియాసిటీ పెంచాయి. కానీ టీజర్లు, ట్రైలర్ల‌లో చూపించిన క్రియేటివిటీని ఆ దర్శకులు సినిమాల్లో చూపించలేకపోయారు. ఆ సినిమాలు నిరాశ‌ప‌రిచాయి.

మరి ‘కథలో రాజకుమారి' ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను మొదట్నుంచి డిఫరెంట్‌ గానే ప్రమోట్ చేస్తున్నారు. దీని టైటిల్ లోగోనే భలేగా ఆకట్టుకుంది. ఆపై నారా రోహిత్ స్టన్నింగ్ అవతారంతో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు టీజర్ సైతం వెరైటీగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉండి జనాల్ని ఆకట్టుకుంటోంది. ఐతే ప్రోమోస్ క్రియేటివ్‌గా, ఆసక్తికరంగా ఉంటే సరిపోదు.. సినిమాలో కంటెంట్ ఉంటేనే నిలబడతాయి. ఈ విషయంలో రోహిత్‌కు అనుభవాలు ఉన్నాయి కాబట్టి సినిమా విషయంలో జాగ్రత్త పడి ఉంటాడని ఆశిద్దాం. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని రూపొందించిన ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకొస్తుందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English