మహేష్‌ని వదలని జగన్‌

మహేష్‌ని వదలని జగన్‌

మహేష్‌బాబుతో పోకిరి 2 లేదా బిజినెస్‌మేన్‌ 2 చేద్దామని పూరి జగన్నాథ్‌ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. మధ్యలో జనగణమణ అంటూ కొత్త ప్రపోజల్‌ కూడా పెట్టాడు. అయితే పూరి రీసెంట్‌ ఫామ్‌ దృష్టిలో పెట్టుకుని అతనితో పని చేయడానికి మహేష్‌ ఆసక్తి చూపించడం లేదు.

తను కథ చెప్పినప్పటికీ చేస్తా లేదా చెయ్యనని మహేష్‌ తేల్చడం లేదని పూరి జగన్నాథ్‌ మీడియా ముందే అసహనం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం బాలకృష్ణతో ఒక కమర్షియల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న పూరి జగన్నాథ్‌ మళ్లీ మహేష్‌ కోసం మరో కథ సిద్ధం చేస్తున్నాడట.

త్వరలోనే మహేష్‌ని కలిసి కథ వినిపిస్తానని అంటున్నాడు. అయితే పూరి ఒక పెద్ద హిట్‌ ఇస్తే తప్ప మహేష్‌ అతనితో సినిమా పట్ల ఆసక్తి చూపించడేమో. అసలే బ్రహ్మూెత్సవం లాంటి చేదు ఫలితాలతో మహేష్‌కి జాగ్రత్త పెరిగింది. ఫాస్ట్‌గా సినిమాలు పూర్తి చేయడం కంటే, క్వాలిటీ మీదే దృష్టి పెడుతున్నాడు. అందుకే మురుగదాస్‌ చిత్రం ఆలస్యమవుతున్నప్పటికీ మహేష్‌ ఎలాంటి కంప్లయింట్‌ లేకుండా తాపీగా షూటింగ్‌ చేసుకుంటున్నాడు. ఇలాంటి టైమ్‌లో మహేష్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చుకోవడం పూరికి కాస్త కష్టమైన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు