ఉద్యోగులు ఊడబీక‌డంపై కాగ్నిజెంట్ క్లారిటీ ఇది

ఉద్యోగులు ఊడబీక‌డంపై కాగ్నిజెంట్ క్లారిటీ ఇది

ఐటీ రంగంలో ప్ర‌ముఖ సంస్థ‌గా పేరున్న కాగ్నిజెంట్ త‌న సంస్థ‌లోని 2.6 లక్షల మంది ఉద్యోగుల్లో 5 శాతం మంది కొలువులు ఊడ‌బీకుతూ తీసుకున్న నిర్ణ‌యంపై క‌ల‌క‌లం రేగుతోంది. ఉద్యోగులను రోడ్డున పడేశారంటూ  కాగ్నిజెంట్ సంస్థపై చెన్నైలోని ఐటీ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. 9 మాసాల వేతనంతో ఉద్యోగులను వదిలించుకొంటున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప‌లు  సంఘాలు తమిళనాడు కార్మిక శాఖ‌కు ఫిర్యాదు చేశాయి. దీంతో కాగ్నిజెంట్ వివ‌ర‌ణ ఇచ్చింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల పనితీరు అసంతృప్తికరంగా ఉందనే కారణాలను చూపుతూ కాగ్నిజెంట్ సంస్థ ఉద్యోగులను తొలగించింది. కాగ్నిజెంట్ తీరును నిర‌సిస్తూ ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ , ఎన్డీఎల్ ఎప్ ఐటీ ఎంప్లాయిస్ లు ఈ మేరకు తమిళనాడు కార్మిక శాఖ‌ కార్యాలయంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ఐటీ ఉద్యోగసంఘాల నాయకులు విన‌తిప‌త్రం అందించారు.

ఈ ప‌రిణామాపైం కాగ్నిజెంట్ కూడ స్పందించింది. అన్ని ఐటీ కంపెనీల్లో ఇది సర్వసాధారణమేనని, ప్రతి ఏటా ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తుంటామని వివ‌ర‌ణ ఇచ్చింది. లక్ష్యాలను చేరుకోలేని వారిని తొలగించి సంస్థలో మార్పులు తప్పనిసరని, ఇదే మొద‌టి సారి, చివ‌రి సారి కాద‌ని తేల్చిచెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు