మాహిష్మ‌తిలో ఆయ‌న‌కు 2బీహెచ్‌కే కావాల‌ట‌

మాహిష్మ‌తిలో ఆయ‌న‌కు 2బీహెచ్‌కే కావాల‌ట‌

బాహుబ‌లి సినిమా కోసం ఊహ‌ల‌కు అంద‌ని అద్భుత ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించింది రాజ‌మౌళి బృందం. మాహిష్మ‌తి రాజ్యంలో దృశ్యాల్ని చూసి క‌ళ్లు చెదిరిపోయాయి ప్రేక్ష‌కుల‌కు. మాహిష్మ‌తి రాజ్యానికి సంబంధించిన విజువ‌ల్స్ చూస్తే ప్రేక్ష‌కుల‌కు క‌లిగిన అనుభూతి అలాంటిలాంటిది కాదు. ఆ రాజ్యంలో మ‌న‌మూ ఉంటే బాగుంటుంద‌న్న భావ‌న క‌లిగించాయి సినిమాలోని దృశ్యాలు. సామాన్య ప్రేక్ష‌కులే కాదు.. రిషి క‌పూర్ లాంటి బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు సైతం మాహిష్మ‌తి మెరుపులు చూసి అబ్బ‌ర‌ప‌డ్డాడు. మాహిష్మతిలో త‌న‌కో 2 బెడ్ రూం హౌస్ కావాలంటూ ఆయ‌న ట్వీట్ చేయ‌డం విశేషం.

బాహుబ‌లి సినిమా ఎక్క‌డ తీశారో ఎవ‌రైనా చెప్పాల‌ని.. ఇందులో త‌న‌కో 2 బీహెచ్‌కే ఇల్లు తీసుకోవాల‌ని ఉంద‌ని.. ఎవ‌రైనా ఏజెంట్ ఉన్నాడా అని చ‌మ‌త్కారంగా ట్వీట్ పెట్టాడు రిషి క‌పూర్‌. బాహుబ‌లి సినిమా ఇండియ‌న్ సెల‌బ్రేష‌న్ అని.. ఇలాంటి సినిమా బిజినెస్‌లో తాను కూడా భాగ‌మైనందుకు గ‌ర్వంగా ఉంద‌ని రిషి క‌పూర్ అన్నాడు. ఈ సినిమా సాధించిన విజ‌యం.. దాని బిజినెస్‌ను మ్యాచ్ చేయ‌డం మిగ‌తా ఫిలిం మేక‌ర్ల‌కు చాలా క‌ష్ట‌మ‌ని ఆయ‌న అభిప్రాయ‌పడ్డాడు.

బాహుబ‌లి-2 సాధించిన అద్భుత విజ‌యాన్ని చూసి అసూయ‌తో చాలామంది బాలీవుడ్ న‌టీన‌టులు, దర్శ‌క నిర్మాత‌లు మౌనం వ‌హిస్తుండ‌గా రిషి క‌పూర్ లాంటి కొంద‌రు మాత్రం ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు