బాహుబలి ప్రభంజనంపై బీబీసీ స్టోరీ

బాహుబలి ప్రభంజనంపై బీబీసీ స్టోరీ

'బాహుబలి' తెలుగు సినిమా అన్న సంగతే అందరూ మరిచిపోయారు. ఇది ఎప్పుడో ఇండియన్ సినిమా అయిపోయింది. మనవాళ్ల కంటే కూడా వేరే ఇండస్ట్రీల వాళ్లు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేషనల్ మీడియా 'బాహుబలి: ది కంక్లూజన్' మీద ప్రశంసలు కురిపిస్తోంది.

ప్రత్యేక కథనాలు వెలువరిస్తోంది. పేరుమోసిన క్రిటిక్స్ ఈ సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. ఐతే అంతర్జాతీయ స్థాయిలోనూ 'బాహుబలి'పై ఇదే స్థాయిలో ప్రశంసలు కురుస్తుండటం విశేషం. స్వయంగా బీబీసీ న్యూస్ 'బాహుబలి' ప్రభంజనం మీద ఒక స్టోరీ నడిపించడం విశేషం.

'బాహుబలి: ది కంక్లూజన్' ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి అండ్ కో లండన్లో ఉన్న సమయంలోనే బీబీసీ న్యూస్ లో ఈ స్టోరీ వచ్చింది. ఈ సినిమా విశేషాల గురించి.. ప్రపంచ వ్యాప్తంగా ఇది సాధిస్తున్న వసూళ్ల గురించి ఆ స్టోరీలో ప్రస్తావించారు. బీబీసీ లండన్ రిపోర్టర్ ఈ సినిమా గురించి రిపోర్ట్ ఇచ్చాడు. స్థానిక క్రిటిక్ కూడా ఒకరు దీనిపై స్పందించారు.

మధ్యలో రాజమౌళి లండన్ ప్రమోషన్లలో ఇచ్చి బైట్ చూపించారు. 'బాహుబలి' బాలీవుడ్ సినిమా కాదని.. టాలీవుడ్ సినిమా అని ఇందులో పేర్కొనడం విశేషం. ఇండియన్ సినిమా స్థాయి 'బాహుబలి'తో ఎంతో పెరిగిందని.. అమెరికాతో పాటు బ్రిటన్లోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాగిస్తోందని చెబుతూ.. తొలి వారం వసూళ్ల వివరాలను కూడా పేర్కొన్నారు. బీబీసీ లాంటి ప్రపంచ నెంబర్ వన్ న్యూస్ ఛానెల్లో మన సినిమా గురించి ఇలా ప్రత్యేక కథనం వెలువడటం గర్వించాల్సిన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు