రమ్యకృష్ణ చెన్నైలో.. కృష్ణవంశీ హైదరాబాద్‌లో

రమ్యకృష్ణ చెన్నైలో.. కృష్ణవంశీ హైదరాబాద్‌లో

డైరెక్టర్ కృష్ణవంశీ.. హీరోయిన్ రమ్యకృష్ణ పెళ్లి చేసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. వీళ్ల ప్రేమాయణం అప్పట్లో అందరికీ పెద్ద షాకే. 'చంద్రలేఖ' సినిమా టైంలో ఇద్దరూ ప్రేమలో పడిపోయి, కొన్నేళ్ల తర్వాత కానీ తమ లవ్ స్టోరీ గురించి బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. పెళ్లి తర్వాత అన్యోన్యంగా జీవిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వీళ్లిద్దరూ.

రమ్య ఇప్పటికీ నటిగా బిజీగా ఉంటే.. కృష్ణవంశీ దర్శకుడిగా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఐతే వీళ్లిద్దరూ చాలా ఏళ్ల నుంచి ఒకే చోట కలిసి ఉండట్లేదట. రమ్య చెన్నైలోనే ఉంటుండగా.. కృష్ణవంశీ హైదరాబాద్‌లో కంటిన్యూ అవుతున్నాడట. భార్యాభర్తలై ఉండి ఇలా వేర్వేరు చోట్ల ఉండటం ఏంటి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణను అడిగితే ఆమె ఏమని సమాధానం ఇచ్చిందంటే..

''నా కెరీర్‌ కోసం నేను చెన్నైలో ఉంటున్నాను. ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. నువ్వక్కడ ఉండటానికి వీల్లేదని ఆయన అంటే నేనేం చేయలేను. కానీ ఆయనకు పని విలువ తెలుసు కాబట్టి నేను హ్యాపీగా కెరీర్‌ కొనసాగించగలుగుతున్నాను. ఇంత స్వేచ్ఛ ఎవరిస్తారు. ఆడవాళ్లంటే ఆయనకు చాలా గౌరవం. ప్రోత్సహిస్తారు. నన్ను చూసి కృష్ణవంశీ గారు చాలా గౌరవిస్తారు. భర్త రూపంలో ఉన్న మంచి స్నేహితుడాయన. మేం ఒకరినొకరు మిస్సవుతున్నామనేమీ అనుకోం. మేం చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే వయసులో లేం. పరిణతి ఉన్న వ్యక్తులం. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోతామనేమీ లేదు. ఫోన్లో మాట్లాడుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. వీలునప్పుడు ఆయన చెన్నైకి వస్తారు. నేను హైదరాబాద్‌ వెళ్తాను. ఐతే అప్పుడు కూడా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటాం. అందుకే అప్పుడప్పుడూ వెకేషన్‌ ప్లాన్‌ చేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తాం'' అని రమ్యకృష్ణ తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు