శంకర! ఈసారి ఏం చేస్తావయ్యా?

శంకర! ఈసారి ఏం చేస్తావయ్యా?

తెలుగు సినిమాల్లో ఎక్కువగా హీరో పేరును శంకర్‌ అనే పెట్టేవారు మన పూర్వీకులు. ప్రస్తుతం రకరకాలు పేరులు పెడుతున్నాం కాని, ఒకప్పుడైతే శంకర్‌దాదా, గుడుంబా శంకర్‌, గౌరీ (శంకర్‌) వగైరా సినిమాలు చాలా వచ్చాయి. అయితే ఇందులో చాలా సినిమాలు బోల్తా కూడా కొట్టాయి.

ఇక ఇప్పుడు 'శంకర' అనే పేరుతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుడు, నారా రోహిత్‌. బాణం సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన రోహిత్‌, ఆ తరువాత ఒక్క సినిమాను కూడా సక్సెస్‌ దిశగా తీసుకువెళ్ళలేకపోయాడు. సోలో, ఒక్కడినే మొదలైన సినిమాలు మనోడి గ్రాఫ్‌ను మరింత పడేశాయి. సారొచ్చారు సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయగా, అది కూడా ఢమాల్‌ అంది.

తాజాగా తాతినేని సత్య దర్శకత్వంలో తమిళంలో హిట్టయిన మౌనగురు అనే సినిమాను 'శంకర' పేరుతో తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడి హిట్టు సినిమానే కావడంతో దీనిపైన చాలా అంచనాలు ఉన్నాయి. మరి ఈసారైనా హిట్టు కొట్టకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కాస్త కష్టమైపోతుంది. అసలే మనోడు నారా వారి ఫ్రంట్‌ ఫేస్‌గా కావాలని ఆరాటపడుతున్నాడాయే...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు