చెత్త సినిమా అన్నా బేఫికర్ అన్నమాట

చెత్త సినిమా అన్నా బేఫికర్ అన్నమాట

ఏ హీరో అయినా తన కొత్త సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో ఈ సినిమా ఆడకపోయినా పర్వాలేదు అంటాడా..? 'బాబు బాగా బిజీ' సినిమా గురించి అవసరాల శ్రీనివాస్ ఈ మాటే అనడం ఆశ్చర్యపరిచింది. దీన్ని బట్టే ఈ సినిమాపై అవసరాలకు.. చిత్ర బృందానికి ఎలాంటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

'బాబు బాగా బిజీ' సినిమా చూసిన ఎవ్వరికైనా.. అడల్ట్ కామెడీ పేరు చెప్పి సొమ్ము చేసుకుందామని చేసిన ప్రయత్నంలా కనిపిస్తుంది తప్ప.. 'హంటర్' లాగా ఇది జెన్యూన్ ఎఫర్ట్ లాగా అయితే అనిపించదు. చాలా తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తి చేసి.. అడల్ట్ కంటెంట్ చూపించి బిజినెస్ చేసుకుని.. అగ్రెసివ్ ప్రమోషన్లతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ద్వారా చిత్ర దర్శక నిర్మాతలు సేఫ్ గేమ్ ఆడేశారు. అందుకే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా బేఫికర్ అన్నట్లే ఉంది నిర్మాత పరిస్థితి. ఇదో చెత్త సినిమా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా కౌంటర్లు లేవు.. సినిమా హిట్టంటూ ఊకదంపుడు ప్రచారాలూ లేవు.

ఎవరైనా భారీ ప్రణాళికలతో కొత్తగా సినీ నిర్మాణంలోకి అడుగుపెడితే.. తొలి సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలని.. తమ సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కేలా సినిమా రావాలని ఆశిస్తారు. కానీ 'అభిషేక్ పిక్చర్స్' లాంటి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. ప్రొడక్షన్లోకి అడుగుపెడుతూ.. ఇలాంటి లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమా తీస్తుందని.. ఇలా ప్రేక్షకుల బలహీనత మీద సొమ్ము చేసుకోవాలని భావిస్తుందని ఎవ్వరూ ఊహించరు. కానీ ఈ సినిమాతోనే నిర్మాణంలోకి అడుగుపెట్టిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా అలాగే చేశాడు. ఇక ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ లాంటి మంచి నటుడు హీరోగా నటించడం ఆశ్చర్యమే.

ఇప్పటిదాకా అవసరాల చేసినవన్నీ చాలా వరకు సాఫ్ట్ అంట్ క్లీన్ క్యారెక్టర్లే. దర్శకుడిగా కూడా అతను ఎలాంటి సినిమాలు తీశాడో తెలిసిందే. అలాంటివాడు 'హంటర్' లాంటి అడల్ట్ కామెడీ రీమేక్‌లో హీరోగా చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇది సరైన ఛాయిసేనా అని చాలామంది సందేహించారు. ఇప్పుడు ఆ సందేహమే నిజమని తేలిపోయింది. మొత్తంగా 'బాబు బాగా బిజీ'లో ఏదో ఆశించిన వెళ్లిన ప్రేక్షకులకు అన్ని రకాలుగా నిరాశే మిగిలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English