మినీ మల్టీస్లారర్: వీరభోగ వసంత రాయలు

మినీ మల్టీస్లారర్: వీరభోగ వసంత రాయలు

మల్టీస్టారర్ అంటే చపెద్ద హీరోలే నటించాల్సిన పని లేదు. యువ కథానాయకులు ఇద్దరు ముగ్గురు కలిసి నటించినీ అది మల్టీస్టారరే. దీన్ని సింపుల్‌గా మినీ మల్టీస్టారర్ అనొచ్చేమో. ఈ మధ్య ఈ తరహా సినిమాలు టాలీవుడ్లో చాలానే శ్రీకారం చుట్టుకుంటున్నాయి. శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న 'శమంతక మణి' ఆ కోవలోనిదే. తాజాగా 'వీర భోగ వసంతరాయలు' పేరుతో మరో మినీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం జరుపుకుంది.

'అప్పట్లో ఒకడుండేవాడు' జంట నారా రోహిత్-శ్రీవిష్ణు మరోసారి కలిసి నటించబోతున్న సినిమా ఇది. ఆ సినిమాకు అసోసియేట్‌గా పని చేసిన ఇంద్రసేన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అతను ముందుగా శ్రీవిష్ణుకు కథ చెప్పి ఒప్పించగా.. తర్వాత నారా రోహిత్ లైన్లోకి వచ్చి అతనూ కథ విని వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చేశాడట. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రియ.. 'జ్యోతిలక్ష్మీ', 'క్షణం', 'ఘాజీ' లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన సత్యదేవ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బెల్లాన అప్పారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 'వీర భోగ వసంతరాయలు' అనే టైటిల్ ఆసక్తి రేకెత్తించేదే. కీలక పాత్ర ధారుల పేర్లనే కలిపి ఈ టైటిల్‌ పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. నారా రోహిత్-శ్రీవిష్ణు.. 'అప్పట్లో ఒకడుండేవాడు' కంటే ముందు 'బాణం', 'ప్రతినిధి' లాంటి సినిమాల్లోనూ కలిసి నటించారు. వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికంటే ముందు నుంచి స్నేహితులు కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English