వార‌ణాసిలో అద‌ర‌గొట్టేసిన క్రిష్‌

వార‌ణాసిలో అద‌ర‌గొట్టేసిన క్రిష్‌

చ‌డీచ‌ప్పుడు లేకుండా త‌న కొత్త సినిమాను మొద‌లుపెట్టేశాడు డైరెక్ట‌ర్ క్రిష్‌. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’ లాంటి చారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమాతో కెరీర్లో అతి పెద్ద విజ‌యాన్నందుకున్న క్రిష్‌.. ఈసారి మ‌రింత భారీ స్థాయిలో ఝాన్సీ ల‌క్ష్మీబాయి క‌థ‌తో ‘మ‌ణిక‌ర్ణిక’ సినిమాకు రంగం సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను చారిత్ర‌క ప్ర‌దేశ‌మైన కాశీలో గురువార‌మే మొద‌లుపెట్టేశాడు క్రిష్‌.

ఈ సినిమాకు ప‌ని చేస్తున్న టీం స‌భ్యులంద‌రూ వార‌ణాసి చేరుకుని.. మ‌ణిక‌ర్ణిక లోగో లాంచ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సాయంత్రం గంగా న‌ది ఒడ్డున 20 అడుగుల ‘మ‌ణిక‌ర్ణిక లోగో పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించింది చిత్ర బృందం. లోగో పోస్ట‌ర్‌తో పాటు దాన్ని లాంచ్ చేసిన తీరు కూడా బాగుంద‌ని క్రిష్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.
ఈ కార్య‌క్ర‌మంలో క్రిష్‌తో పాటు హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్, సంగీత ద‌ర్శ‌కులు శంక‌ర్-ఎహ‌సాన్-లాయ్‌.. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్.. నిర్మాత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాదే స్క్రిప్టు అందిస్తుండ‌టం విశేషం. ‘గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి’తో చారిత్ర‌క క‌థ‌ల్ని తెర‌కెక్కించే స‌త్తా తనుకుంద‌ని చాటుకున్న క్రిష్‌.. ఈసారి మ‌రింత పెద్ద ప్ర‌య‌త్నాన్నే త‌ల‌కెత్తుకున్నాడు.

‘శాత‌క‌ర్ణి’ త‌ర్వాత మ‌రీ ఎక్కువ స‌మ‌య‌మేమీ తీసుకోకుండా ‘మ‌ణిక‌ర్ణిక’ స్క్రిప్టు సిద్ధం చేయించేశాడు. క్రిష్‌కు ఈసారి విజ‌యేంద్ర ప్ర‌సాద్ లాంటి దిగ్గ‌జ ర‌చ‌యిత తోడ‌వుతుండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తి  రేకెత్తిస్తోంది. క్రిష్ కంటే ముందు ఝాన్సీ ల‌క్ష్మీబాయి క‌థ‌తో సినిమా తీయాల‌ని బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌క్ కేత‌న్ మెహ‌తా ఆశించాడు. కానీ ఈలోపే క్రిష్ రంగంలోకి దిగిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు