కంఫర్ట్‌ జోన్‌ నుంచి రాజమౌళి బయటకి పోగలడా?

కంఫర్ట్‌ జోన్‌ నుంచి రాజమౌళి బయటకి పోగలడా?

రాజమౌళి చిత్రాలకి ఒకే టీమ్‌ కంటిన్యూ అవుతూ వుంటుంది. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులని చుట్టూ పెట్టుకుని పని చేయడం అతనికి ఇష్టం. అన్నయ్య కీరవాణితో సంగీతం, తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ, భార్య రమతో కాస్టూమ్స్‌ ఇలా అన్నిట్లోను సొంత బలాన్ని రాజమౌళి కోరుకుంటాడు. తెలుగు సినిమాల వరకు ఇది చెల్లిపోయింది.

ఇకపై రాజమౌళి జాతీయ స్థాయికి వెళితే, బాలీవుడ్‌ చిత్రాలని ప్లాన్‌ చేస్తే ఈ టీమ్‌ కొనసాగించే అవకాశాలు తగ్గిపోతాయి. కార్పొరేట్‌ సంస్థలు రంగంలోకి దిగితే, బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌తో ఒప్పందాలు కుదిరితే అన్నిట్లోను క్వాలిటీ పెరగాలని వారు కోరుకుంటారు.

కీరవాణి సంగీతం దక్షిణాది వారికి అప్పీల్‌ అవుతుంది కానీ హిందీలో ఇలాంటి పాటలు చెల్లవు. అలాగే మిగతా టీమ్‌ విషయంలోను రాజమౌళి రాజీ పడాల్సి రావచ్చు. తన బలం కుటుంబమేనని, తనకి కావాల్సిన వాతావరణాన్ని వాళ్లు సెట్‌ చేయడం వల్ల తనపై ఒత్తిడి తగ్గిపోయి క్రియేటివ్‌గా ఆలోచించగలుగుతున్నానని రాజమౌళి అంటుంటాడు.

టాలీవుడ్‌ని దాటిపోతే ఈ కంఫర్ట్స్‌ అన్నీ మిస్‌ అయ్యే అవకాశాలుంటాయి కనుక రాజమౌళి ఉత్తరాది వైపు కదిలి వెళతాడా లేదా అని అతడికి బాగా తెలిసిన వారే డౌట్‌ పడుతున్నారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు