విజయేంద్ర ప్రసాద్ స్టోరీ..లారెన్స్ హీరో

విజయేంద్ర ప్రసాద్ స్టోరీ..లారెన్స్ హీరో

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ రైటర్లలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ఓవైపు 'బాహుబలి' మెగా ఫాంటసీ సినిమా.. మరోవైపు 'భజరంగి భాయిజాన్' లాంటి చక్కటి సోషల్ మూవీతో తన ప్రత్యేకతను చాటుకున్నారు విజయేంద్ర ప్రసాద్.

ప్రస్తుతం ఆయన తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా కథ, స్క్రీన్ ప్లే రాసింది విజయేంద్ర ప్రసాదే. దీని తర్వాత ఆయన మరో తమిళ సినిమాకు స్క్రిప్టు అందించబోతుండటం విశేషం. ఆ సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తాడట. విజయేంద్ర ప్రసాద్‌తో పాటు రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన మహదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట.

మహదేవ్ 'మిత్రుడు' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ 'జాగ్వార్' తీశాడు. ఈ రెండు సినిమాలూ ఫ్లాపే అయ్యాయి. ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని.. లారెన్స్ హీరోగా తమిళ-తెలుగు భాషల్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

మహదేవ్ కంటే కూడా విజయేంద్ర ప్రసాద్ మీద భరోసాతోనే లారెన్స్ ఈ సినిమా ఓకే చేసినట్లున్నాడు. మరి ఈసారైనా తన శిష్యుడిని విజయేంద్ర గట్టెక్కిస్తాడేమో చూడాలి. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళి కొత్త చిత్రానికి స్క్రిప్టు రెడీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆయన రాసిన కథల్లోంచి ఒకదాన్ని రాజమౌళి ఎంచుకుంటే.. దాన్ని పూర్తిస్థాయి స్క్రిప్టుగా తీర్చిదిద్దే పనిలో పడతారాయన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English