హాట్‌ ఫోటో: కలర్‌లో చితక్కొట్టేసింది

హాట్‌ ఫోటో: కలర్‌లో చితక్కొట్టేసింది

రెండ్రోజుల క్రితం ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో పెట్టి ఇక 'హద్దులు లేవు' అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తేజస్వి మదివాడ అదే ఫోటోని కలర్‌లో అప్‌లోడ్‌ చేసింది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఆ ఒంపులు, సొంపులు, మెలికలు, లోతులు అంత స్పష్టంగా లేవు కానీ కలర్‌లో అదే స్టిల్‌ చితక్కొట్టేసింది.

ఇకపై తన నుంచి ఇలాంటి రచ్చే వుంటుందని డైరెక్టుగా చెబుతోన్న తేజస్వి, 'బాబు బాగా బిజీ' చిత్రంలో తనపై రెండు, మూడు హాట్‌ సీన్లు పెట్టమని రిక్వెస్ట్‌ చేసిందట. అయితే తన పాత్రకి అనుగుణంగా ఎక్కువ గీత దాటనివ్వలేదని, అయితే ట్రెయిలర్‌లో వచ్చిన బిట్లు చూసే ఫాన్స్‌ ఉర్రూతలూగిపోవడం చూస్తోంటే వారికి కనువిందు చేసేలా మరో చిత్రం త్వరలోనే చేయాలని వుందని తేజస్వి అంటోంది.

అచ్చ తెలుగు హీరోయిన్లు మరీ మడి కట్టుకు కూర్చోవడం వల్లే ఎక్కువ డిస్టెన్స్‌ వెళ్లలేకపోయారనేది తేజస్వి గుర్తించినట్టుంది. అందుకే బాలీవుడ్‌ హీరోయిన్ల మాదిరిగా హద్దుల్లేవ్‌, అరమరికల్లేవ్‌ అంటూ ఫ్రీ షో ఇచ్చేసి మరీ ఫాన్స్‌కి నిద్ర చెడగొడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు