సెంచ‌రీ వీరుడు బాహుబ‌లి

సెంచ‌రీ వీరుడు బాహుబ‌లి

‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్’ రూ.600 కోట్ల మార్కును దాటేసి వెయ్యి కోట్ల మైలురాయి దిశ‌గా దూసుకెళ్తుంటే.. ఇంకా వంద కోట్ల గురించి చ‌ర్చేంటి అంటారా..? ఇది తెలుగు రాష్ట్రాల వ‌సూళ్ల లెక్క‌. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబ‌ర్ 150’ ఫుల్ ర‌న్లో రూ.100 కోట్ల షేర్ సాధించి.. నాన్-బాహుబ‌లి రికార్డు నెల‌కొల్పితే.. బాహుబ‌లి-2 కేవ‌లం ఐదు రోజుల్లోనే.. అది కూడా తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకోవ‌డం విశేషం. ప్ర‌తి ఏరియాలోనూ క‌ళ్లు చెదిరే వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది ఈ చిత్రం.

ఐతే బ్రేక్ ఈవెన్ కు రావ‌డానికి బాహుబ‌లి-2 ఇంకా చాలానే వ‌సూలు చేయాలి. ఐతే రెండో వీకెండ్ అయ్యేస‌రికి బ‌య్య‌ర్లందూ సేఫ్ జోన్లోకి వ‌చ్చేస్తార‌ని భావిస్తున్నారు. వైజాగ్ ఏరియాలో మాత్రం ఇప్ప‌టికే దాదాపుగా బ్రేక్ ఈవెన్ సాధించేసింది బాహుబ‌లి-2.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా తొలి ఐదు రోజుల్లో బాహుబ‌లి-2 షేర్స్ వివ‌రాలు..
నైజాం-రూ.28.42  కోట్లు
వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.12.48 కోట్లు
సీడెడ్‌ (రాయలసీమ)-రూ.17.55 కోట్లు
తూర్పు గోదావ‌రి-రూ.10.82 కోట్లు
ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.8.66 కోట్లు
గుంటూరు-రూ.10.82 కోట్లు
కృష్ణా- రూ.7.22 కోట్లు
నెల్లూరు-రూ.4.04 కోట్లు
ఏపీ-తెలంగాణ షేర్- రూ100.37 కోట్లు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు