సెక్స్‌ సీన్లు చేస్తే తప్పేంటండీ

సెక్స్‌ సీన్లు చేస్తే తప్పేంటండీ

'బాబు బాగా బిజీ' చిత్రం చేయడం ఏదో చేయరాని నేరం అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారని, తన ఇమేజ్‌ పర్మినెంట్‌గా డ్యామేజ్‌ అయిపోతుందని భయపెడుతున్నారని అవసరాల శ్రీనివాస్‌ అన్నాడు. తెరపై ఒక నలభై మర్డర్లు చేసిన వాడిని నిజ జీవితంలో కిల్లర్‌ అంటారా? విలన్‌లా చూస్తారా? మరి తెరపై శృంగార దృశ్యాల్లో 'నటించిన' వారిని చిన్నచూపు ఎందుకు చూడాలి? వారిపై ఎందుకు 'చీప్‌' అనే ముద్ర వేయాలి అని ప్రశ్నిస్తున్నాడు.

'బాబు బాగా బిజీ'లాంటి చిత్రం చేస్తున్నావని తెలిసి మీ తల్లిదండ్రులు ఏమన్నారు? అని కొందరు అడుగుతున్నారని, ఇది ఒక సినిమా అని, కేవలం నటించానని ఎందుకు గుర్తించడం లేదు అంటూ అవసరాల అడుగుతున్నాడు. ఆ సినిమాలో 'నా స్కోరెంత' అని అడిగే సీన్‌ వుండడంతో నిజ జీవితంలోను తనని ఆ ప్రశ్న అడిగేయవచ్చునని కొందరు భావిస్తున్నారని, అలా అడిగిన వాళ్లు కూడా వున్నారని ఆశ్చర్యపోయాడు.

తన వరకు నటుడిగా ఛాలెంజ్‌ చేసే పాత్రలు వచ్చినపుడు ఖచ్చితంగా చేస్తానని, బాబు బాగా బిజీ ఆడినా, ఆడకపోయినా ఇది చేయడం పట్ల రిగ్రెట్‌ అవనని, అలా అని ఇకపై అన్నీ ఇలాంటి పాత్రలే చేస్తానని అనడం లేదని చెప్పాడు. బాహుబలి తర్వాత రిలీజ్‌ చేస్తున్నామని కొందరు భయపెడుతున్నారని, కానీ ఇది సరయిన సమయమని తన నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారని, ఆ రంగంలో వారికి అనుభవం వుంది కనుక వారి నమ్మకాన్ని నమ్ముతానని, ఇది కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే సినిమా అని నమ్ముతున్నానని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English