ప్రభాస్‌ తొందర పడ్డాడా?

ప్రభాస్‌ తొందర పడ్డాడా?

'బాహుబలి 2' అంచనాలని మించిపోయి బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రత్యేకించి హిందీ బెల్ట్‌లో బాహుబలి ఉదృతి ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. జాతీయ వ్యాప్తంగా ప్రభాస్‌కి గుర్తింపు రావడంతో పాటు అభిమానులు కూడా ఏర్పడ్డారు. మేడమ్‌ టుస్సాడ్స్‌లో వేక్స్‌ స్టేట్యూ కూడా త్వరలోనే ఆవిష్కృతం కానుంది. బాహుబలితో ప్రభాస్‌ పాపులారిటీ అయితే చాలా రెట్లు పెరిగింది. అతని తదుపరి చిత్రంపై ఖచ్చితంగా నేషనల్‌ వైడ్‌ అటెన్షన్‌ వుంటుంది.

బాహుబలి హీరో సోషల్‌ ఫిలిం అంటూ మళ్లీ సోషల్‌ మీడియా వైల్డ్‌ అయిపోతుంది. అంత అటెన్షన్‌ రాబట్టే చిత్రానికి ప్రభాస్‌ ఒక అనుభవజ్ఞుడిని కాకుండా యువ దర్శకుడు సుజిత్‌ని నమ్ముతున్నాడు. రన్‌ రాజా రన్‌తో టాలెంటెడ్‌ అని నిరూపించుకున్న సుజిత్‌కి ఒక భారీ బడ్జెట్‌ చిత్రాన్ని హ్యాండిల్‌ చేసిన అనుభవం లేదు. రాజమౌళి లాంటి బ్రాండ్‌ హెల్ప్‌ అవడంతో బాహుబలిగా ఎదిగిన ప్రభాస్‌ ఇప్పుడు ఎలాంటి ఇమేజ్‌ లేని దర్శకుడితో ఎంత దూరం వెళ్లగలడు? అతను ఒక సగటు యాభై కోట్ల బడ్జెట్‌ తెలుగు సినిమా ప్లాన్‌ చేసుకుంటే ఓకే కానీ వంద కోట్లకి పైగా బడ్జెట్‌తో మళ్లీ ఇండియన్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తోన్న ప్రభాస్‌ తన తదుపరి చిత్రం విషయంలో తొందరపడ్డాడా? సాహో చిత్రం టీజర్‌ అయితే ఆశించిన స్పందన రాబట్టలేదు.

సినిమాపై ఎలాంటి ప్రత్యేక అంచనాలని సృష్టించలేదు. అసలే రాజమౌళితో పని చేసిన తర్వాత హీరోలకి మళ్లీ ఆ అంచనాలని అందుకోవడం చాలా కష్టమని చరిత్ర చెబుతోంది. ప్రభాస్‌ సరయిన నిర్ణయమే తీసుకున్నాడా లేదా అనేది తెలియడానికి వచ్చే వేసవి వరకు వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English