బాహుబలికి మతం మకిలి!

బాహుబలికి మతం మకిలి!

'బాహుబలి' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వున్న భారతీయులంతా ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని యాంటీ ముస్లిమ్‌గా మీడియాలో కొందరు ముద్ర వేసారు. ఇందులో కేవలం హిందూ మత సాంప్రదాయాల్నే చూపించారు తప్ప మరో మతం వున్నట్టు చూపించలేదని, ఇండియాలో ఎంత పురాతన కాలంలో జరిగిన కథ అయినప్పటికీ, ఎంత ఫాంటసీ అయినప్పటికీ వాస్తవాలకి అతీతంగా వుండరాదని, ఇండియాలో అన్ని మతాలు వున్నట్టు చూపించాల్సిందని, ఇది మత వివక్ష అంటూ విమర్శలు గుప్పించారు.

ఇదిలావుంటే మతోన్మాదులు ఈ టాపిక్‌ని మరో కోణంలో లాగుతున్నారు. ఇంతకాలానికి యాంటీ హిందూ అనలేని ఒక భారతీయ చిత్రం వచ్చిందని, దీనిని ప్రతి హిందువు చూడాలని సోషల్‌ మీడియాలో రెచ్చిపోతున్నారు. అసలు రాజమౌళి కానీ, ఈ చిత్రం తీసిన వాళ్లు కానీ ఎక్కడా మతాన్ని ప్రత్యేకించి ప్రబోధించలేదు. హిందూ రాజులు, వారి నమ్మకాలు, ఆచారాలు మాత్రమే వున్నాయి తప్ప ప్రత్యేకించి దీనిని హిందూత్వ సిద్దాంతాలని ప్రబోధించడానికి తీయలేదు.

తెలుగు ప్రేక్షకుల్లో ఎవరూ దీనిని ఈ కోణంలో చూడకపోయి ఉత్తర భారతంలో మాత్రం చాలా మంది ఇదే దృష్టితో చూస్తూ బాహుబలికి మతం మకిలి అంటిస్తోంది. ఇది ఒక జాఢ్యంగా ముదరకముందే రాజమౌళి లేదా రచయిత విజయేంద్రప్రసాద్‌ దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తే సరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు