ప్రభాస్ డబుల్ ధమాకా

ప్రభాస్ డబుల్ ధమాకా

టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే ఏ హీరో చేయలేని సాహసం చేశాడు ప్రభాస్ 'బాహుబలి' కోసం. ఏకంగా నాలుగేళ్లకు పైగా ఈ ఒక్క సినిమాకే అంకితం అయిపోయాడు. అందుకు తగ్గట్లు మంచి ఫలితమే వచ్చింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ ఊపులో ఇక వరుసగా సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

సుజీత్ దర్శకత్వంలో ఆల్రెడీ 'సాహో' మొదలుపెట్టేశాడు. ఐతే ఈ ఏడాదిని ఈ ఒక్క సినిమాకే అంకితం చేయట్లేదు. ఇంకో రెండు నెలల్లో ప్రభాస్ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా మొదలుపెట్టేయబోతున్నాడు.

ఇటు 'సాహో'తో పాటు.. అటు రాధాకృష్ణ మూవీని కూడా ఒకేసారి చేయబోతున్నాడు ప్రభాస్. 'సాహో' టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోంది. దీనికి బ్యాగ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంది. మధ్య మధ్యలో విరామాలు ఉండబోతున్నాయి. ఆ ఖాళీల్లో ప్రభాస్ రాధాకృష్ణ సినిమా చేస్తాడు. 'సాహో' పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా చాలా సమయం పడుతుందట.

ఆ సమయాన్ని వృథా కానివ్వకుండా సరిగ్గా డేట్లు సర్దుబాటు చేసుకుంటున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ సినిమా కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కుతుందని.. చాలా పోర్షన్స్ ఫారిన్లో షూట్ చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు