బాహుబలి ముందు రెండే మిగిలాయి

బాహుబలి ముందు రెండే మిగిలాయి

మూడు రోజుల్లో యుఎస్‌ఏ, కెనడా దేశాల్లో పది మిలియన్‌ డాలర్లకి పైగా సాధించి, అత్యంత వేగంగా ఈ మార్కుని చేరుకున్న ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పిన 'బాహుబలి 2' ఇక రెండు సినిమాల ఫుల్‌ రన్‌ రికార్డులని అధిగమించాల్సి వుంది. పికె చిత్రం లైఫ్‌ టైమ్‌ బిజినెస్‌ (10.56 మిలియన్‌ డాలర్లు) సోమవారంతో అధిగమిస్తుంది.

'దంగల్‌' సాధించిన 12.36 మిలియన్‌ డాలర్ల రికార్డుని వచ్చే శుక్రవారానికి బీట్‌ చేయడం ఖాయమని ట్రేడ్‌ అంటోంది. ఇండియన్‌ సినిమా హిస్టరీలో యుఎస్‌, కెనాడాల్లో అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా బాహుబలి అవతరించనుంది. మొదటి వారాంతంలోనే పది మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో ఫుల్‌ రన్‌లో పదిహేను మిలియన్లని దాటడం ఖాయమనేది సుస్పష్టం.

అయితే ఆ పైన మరో మూడు మిలియన్లు సాధిస్తుందా లేక అయిదు మిలియన్లు వసూలు చేసి ఇరవై మిలియన్లని చేరుతుందా అనేది చూడాలి. యుఎస్‌లో 'గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ' రిలీజ్‌ వుండడంతో ఐమ్యాక్స్‌లు కేవలం వారం రోజులకే దొరికాయి. లేదంటే ఇరవై మిలియన్లు కేక్‌ వాక్‌ అయిపోయి వుండేది. మరో అయిదారు వారాల వరకు భారీ సినిమాలేం లేవు కనుక ఇప్పటికీ ఇరవై మిలియన్‌ రికార్డు రూల్‌ అవుట్‌ చేయడానికి లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు