రాజ‌మౌళి మిస్స‌యిన భ‌జరంగి భాయిజాన్

రాజ‌మౌళి మిస్స‌యిన భ‌జరంగి భాయిజాన్

రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాసిన అత్యుత్త‌మ క‌థ‌ల్లో 'భ‌జరంగి భాయిజాన్ ' క‌చ్చితంగా ఉంటుంది. ఐతే అంత మంచి క‌థ‌ను ఆయ‌న బాలీవుడ్ వాళ్ల‌కు ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. అదే క‌థ‌ను త‌న కొడుకు రాజ‌మౌళికో.. మ‌రో టాలీవుడ్ ద‌ర్శ‌కుడికో ఇవ్వ‌క‌పోవ‌డం.. ఇక్క‌డ ఆ సినిమా తీయ‌క‌పోవ‌డం కొంద‌రికి ఆశ్చ‌ర్యంగా అనిపించింది.

ఐతే ఈ క‌థ‌ను ముందు రాజ‌మౌళికే ఆఫ‌ర్ చేశాడ‌ట విజ‌యేంద్ర. ఐతే అప్పుడున్న మూడ్ లో రాజ‌మౌళి ఆ క‌థ‌ను స‌ల్మాన్ ఖాన్ కే ఇచ్చేయ‌మ‌న్నాడ‌ట‌. కానీ ఆ త‌ర్వాత ఆ క‌థ‌ను తానే తీసుకోవాల్సింద‌ని ఫీల‌య్యాడ‌ట‌. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వ‌యంగా విజ‌యేంద్ర ప్ర‌సాదే ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు.

''త‌నకో క‌థ కావాల‌ని స‌ల్మాన్ ఖాన్ న‌న్ను అడిగాడు. అప్పుడు నాకు 'భ‌జ‌రంగి భాయిజాన్' క‌థ మీదికి దృష్టిమ‌ళ్లింది. అప్పుడు రాజ‌మౌళి ద‌గ్గ‌రికెళ్లి 'నా దగ్గర ఓ మంచి కథ ఉంది, చేస్తావా.. లేదంటే సల్మాన్ కు ఇచ్చేయనా' అని అడిగాను. అత‌ను ఇచ్చేయ‌మ‌న్నాడు. కానీ భ‌జరంగి భాయిజాన్‌' విడుదలైన తర్వాత మాత్రం 'మీరు అడిగినప్పుడు నేను కొంచెం పని ఒత్తిడిలో ఉన్నాను.

15 రోజుల ముందు కానీ.. 15 రోజుల త‌ర్వాత కానీ అడిగి ఉంటే కచ్చితంగా ఆ క‌థ‌ను తీసుకునేవాడిని. సినిమా చేసేవాడిని' అన్నాడు'' అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు. ఐతే బాహుబ‌లి మొద‌ల‌య్యాక స‌ల్మాన్ కోసం విజ‌యేంద్ర రాసిన క‌థ 'భ‌జ‌రంగి భాయిజాన్'. మ‌రి రాజ‌మౌళి తీరిగ్గా ఉన్న‌పుడే విజ‌యేంద్ర ఈ క‌థ‌ను చెప్పి ఉంటే మాత్రం దీన్ని అట్టిపెట్టుకుని ఎప్ప‌టికి సినిమా తీద్దామ‌నుకున్నాడో రాజ‌మౌళి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు