తెలుగు సింగర్లకు అవి వద్దట

తెలుగు సింగర్లకు అవి వద్దట

తెలుగులో చాలామంది హాట్‌ సింగర్లు ఉన్నారు. మన లేడి సింగర్స్‌లో చాలామంది హీరోయిన్లను మించే అందంతో కుర్రాళ్ళను కవ్విస్తుంటారు. సింగర్‌ సునీత్‌ దగ్గర నుండి, గీతామాధురి, శ్రావన భార్గవి, ప్రణవి, చైత్ర వరకు అందరూ గ్లామర్‌  గాళ్సే.

ఇదే ఏ తమిళంలోనో మళయాలంలోనో అయితే, ఈపాటికి ఆ సింగర్లు ఖచ్చితంగా వెండితెర వెలుగుజిలుగుల్లో మెరిసిపోయేవారు. మళయాలంలో సింగర్‌గా వచ్చిన మమతామోహన్‌ దాస్‌, తమిళ సింగర్‌ ఆండ్రియా జెరీమియా, ఇప్పుడు హీరోయిన్లుగానే ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మన తెలుగు సింగర్లు మాత్రం మాకు అవి వద్దనే అంటున్నారు. పైగా యువతరంలో గ్లామర్‌కు అద్దంపడుతున్న గాయనీమనులు పెళ్ళి బాట పడుతున్నారు.

ఈ మధ్యనే శ్రావణ భార్గవి ఒక ఇంటిదైతే, ఇప్పుడు గీతామాధురి కూడీ పెళ్ళి పీటలు ఎక్కడానికి రెడీగా ఉంది. అదేంటోమరి అని చాలామంది అంటున్నారు కాని, సంగీతంతో జనాలను ఆట్టుకుంటున్న అమ్మాయి మేకప్‌ వేసుకోవాల్సిన అసవరం ఏముంది అంటున్నారు కొందరు...!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు