ఒక్క రోజులో శ్రీమంతుడు అవుట్‌!

ఒక్క రోజులో శ్రీమంతుడు అవుట్‌!

యుఎస్‌లో మహేష్‌బాబు ఎంతటి శక్తివంతమైన స్టార్‌ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బాహుబలి మొదటి భాగం మినహాయిస్తే, యుఎస్‌లో మూడు మిలియన్‌ డాలర్ల వసూళ్లకి దగ్గరగా వెళ్లింది మహేష్‌బాబు ఒక్కడే. ఫుల్‌ రన్‌లో 2.9 మిలియన్‌ డాలర్లను శ్రీమంతుడు వసూలు చేస్తే, ఒకే ఒక్క రోజులో బాహుబలి దానిని కొట్టేయడం చూసి తలలు పండిన ట్రేడ్‌ పండితులే ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రీమియర్లు, శుక్రవారం కలిపి నాలుగున్నర మిలియన్‌ డాలర్లకి పైగా వసూలు చేసిన 'బాహుబలి 2' శనివారం మాత్రం మూడు మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఇంకా పూర్తి లెక్కలు రాలేదు కానీ భారతీయ సినీ చరిత్రలో యుఎస్‌లో ఒక్క రోజులో ఇంత వసూలు చేసిన చిత్రమే ఇంకోటి లేదట.

ఆదివారానికల్లా పది మిలియన్లు చేరుకుంటుందా లేదా అని చర్చ జరుగుతోంది. తెలుగు సినీ చరిత్రలో పది మిలియన్లు దాటుతోన్న మొదటి చిత్రంగా బాహుబలి రికార్డులకి ఎక్కనుంది. పదిహేను మిలియన్‌ డాలర్లకి పైసా తగ్గదంటోన్న ఈ చిత్రం రాబోయే బాలీవుడ్‌ చిత్రాలకి కూడా బెంచ్‌మార్క్‌ని అందనంత ఎత్తులో పెడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English