వంద కోట్లు కాదు సర్‌, దానికి డబుల్‌

వంద కోట్లు కాదు సర్‌, దానికి డబుల్‌

బాలీవుడ్‌ మీడియా వాళ్లు, ట్రేడ్‌ అనలిస్టులు 'బాహుబలి 2'కి వున్న క్రేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్‌ వస్తుందని, ఇది అద్భుతమని అన్నారు. అయితే రాజమౌళి సత్తా తెలిసిన తెలుగు వాళ్లు వంద కోట్లు ఇండియాలోనే వస్తుందని సవాల్‌ చేసారు. మనవాళ్లు చెప్పినట్టుగానే కేవలం ఇండియాలోనే బాహుబలి 2కి నూట పది కోట్లకి పైగా వసూళ్లు వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు గ్రాస్‌ కల్షన్లు రెండు వందల కోట్లు దాటేసాయి. దీంతో బాలీవుడ్‌ మీడియా షాకవుతోంది. ఒక రీజనల్‌ సినిమాకి ఇంతటి రేంజ్‌ ఏమిటని వారు ఆశ్చర్యపోతున్నారు. వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తుందంటూ మన ట్రేడ్‌ వేసిన అంచనాలు హైప్‌ మాటలు కాదని, ఈ చిత్రానికి అంత సత్తా వుందని ఈ ఓపెనింగ్సే నిరూపించాయి.

ఇంకా ఆదివారం, సోమవారం (పబ్లిక్‌ హాలిడే) జరిగే రచ్చ ఎలా వుంటుందనేది ఊహించడం కూడా కష్టమే. చూసిన వాళ్లే మళ్లీ మళ్లీ బారులు తీరుతున్నారని రిపోర్ట్స్‌ వస్తోన్న నేపథ్యంలో ఈ ప్రభంజనం కనీసం మరో రెండు వారాల పాటయినా సాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ధాటి ఊహించడం వలనేనేమో మే నెలలో ప్లాన్‌ చేసిన పెద్ద చిత్రాలన్నీ మనవాళ్లు ముందుగానే వెనక్కి పంపేసారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English