బాలీవుడ్ యువ తారల్ని ఉతికారేశాడు

బాలీవుడ్ యువ తారల్ని ఉతికారేశాడు

సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరైన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్.. మరోసారి ఆ తరహా వ్యాఖ్యలే చేశారు. బాలీవుడ్ యువతరం నటీనటులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. క్యాన్సర్ కారణంగా చనిపోయిన సీనియర్ నటుడు వినోద్‌ ఖన్నా అంత్యక్రియలకు బాలీవుడ్ యంగ్ స్టార్స్ హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇది సిగ్గుమాలిన చర్య అని ఆయన అన్నారు. తాను చనిపోయినపుడు మోయడానికి నలుగురైనా వస్తారా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సీనియర్‌ నటుడు చనిపోతే పరామర్శించే తీరిక లేదా అంటూ బాలీవుడ్ యువతారల్ని నిలదీశాడు రిషి.

ఈ తరానికి చెందిన నటీనటులెవ్వరూ వినోద్‌ ఖన్నా అంత్యక్రియలకు హాజరుకాకపోవడం అవమానకరమని.. ఆయనతో కలిసి నటించిన వాళ్లు కూడా అంత్యక్రియలకు రాలేదని రిషి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని.. భవిష్యత్తులో తాను చనిపోయినా వీళ్లలో ఎవరైనా తనను మోయడానికి వస్తారన్న గ్యారెంటీ లేదన్నాడు రిషి. ఇటీవల ప్రియాంక చోప్రా ఇచ్చిన పార్టీకి బాలీవుడ్ చెంచా గ్యాంగ్‌ అంతా వెళ్లిందని.. కానీ ఖన్నా అంత్యక్రియలకు మాత్రం ఎవ్వరూ రాలేదని రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐతే యువ తారల్ని ఇలా తిట్టిపోస్తున్న రిషి కపూర్ సైతం అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆయన తన కుటుంబంతో విదేశాల్లో ఉన్నారు. అంత్యక్రియలకు రావాలనే అనుకున్నామని.. ఐతే అది కుటుంబ సభ్యులకే పరిమితం చేస్తారని తనకు సమాచారం అందడంతో వెనక్కి తగ్గినట్టు రిషి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు