కృష్ణవంశీ గురించి బండ్ల గోల ఇదే!

 కృష్ణవంశీ గురించి బండ్ల గోల ఇదే!

ఏం తీయాలనేది ముందే డిసైడ్‌ కాడని, సెట్‌కి వచ్చి ఏం తీయాలా అని ఆలోచిస్తుంటాడని, షాట్‌ ఎలా పెట్టాలని ఆలోచిస్తాడే తప్ప మంచి కథ మీద కసరత్తు చేయడని, అతని వల్ల చాలా వేస్టేజీ జరుగుతుందని, అలాంటి దర్శకుడిని అసలు చూడలేదని, మళ్లీ జీవితంలో అతనితో పని చేయకూడదని అనుకుంటున్నానని బండ్ల గణేష్‌ ఎవరి గురించి చెప్పాడనేది తెలిసిందే.

'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి తనకి ఎదురైన చేదు అనుభవాలని బండ్ల గణేష్‌ దాపరికం లేకుండా ఏకరవు పెట్టాడు. తనపై అతను చేసిన ఆరోపణలకి కృష్ణవంశీ వివరణ మాట అటుంచితే, 'నక్షత్రం' లాంటి లో బడ్జెట్‌ చిత్రాన్ని కృష్ణవంశీ మొదలు పెట్టి ఇవాళ్టికి సరిగ్గా సంవత్సరం అయింది. ఇప్పటికి వంద రోజులకి పైగానే షూటింగ్‌ జరిగింది. ఇంకా కొన్ని రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌ వుంది.

సూపర్‌స్టార్లతో తీసే భారీ బడ్జెట్‌ చిత్రాలని కూడా ఇప్పుడు ఎనభై రోజుల్లోపే పూర్తి చేసేస్తున్నారు. పెద్ద సినిమాల్లో అరుదుగా ఒకటీ రెండు తప్ప మిగతావన్నీ ఆరు లేదా ఏడు నెలల్లో పూర్తయిపోతున్నాయి. చిన్న సినిమా అయితే మూడు నెలలకి మించి సెట్స్‌ మీద వుంటే పెట్టుబడి వర్కవుట్‌ అవదు.

నక్షత్రం చిత్రానికి స్టార్‌ పవర్‌ లేకపోయినా, తన పేరుకిప్పుడు జనాన్ని రాబట్టే శక్తి లేకపోయినా కృష్ణవంశీ దీనిపై అవసరానికి మించిన ఖర్చు పెట్టడం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే తడిసి మోపెడయిన ఈ చిత్రం బడ్జెట్‌కి బ్లాక్‌బస్టర్‌ రిజల్ట్‌ వచ్చినా రికవరీ కష్టమనేది ఇండస్ట్రీ మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు