'బాహుబలి-2' బొమ్మ పడేసరికి రాజమౌళి అక్కడ..

'బాహుబలి-2' బొమ్మ పడేసరికి రాజమౌళి అక్కడ..

జక్కన్న. అప్పుడు కూడా 'బాహుబలి'కే తన సమయాన్నంతా కేటాయించాడు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా గడిపాడు. ఆ పని అయ్యాక ప్రమోషన్ మీద దృష్టిపెట్టాడు. విడుదలకు రెండు రోజుల ముందు కూడా మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ ఉన్నాడు.

రిలీజ్ కు ముందు రోజు కూడా బిజీనే. కానీ సినిమా విడుదలయ్యే రోజు మాత్రం రాజమౌళి హైదరాబాద్‌లో ఉండట్లేదు. హైదరాబాద్ అనే కాదు.. 'బాహుబలి' విడుదలయ్యే ఏ చోటా రాజమౌళి ఉండబోవట్లేదు. ఆ సమయానికి జక్కన్న భూటాన్‌లో ప్రత్యక్షం కాబోతున్నాడు. అవును.. తాను 'బాహుబలి: ది కంక్లూజన్' విడుదల రోజుకు తాను భూటాన్‌లో ఉంటానని రాజమౌళి తెలిపాడు.

ఈ సినిమా పని ముగియగానే తాను కుటుంబంతో కలిసి హాలిడేకు వెళ్లబోతున్నట్లు రాజమౌళి ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఎంచుకున్న డెస్టినేషన్ ఏంటో ఎవరికీ తెలియలేదు. తాజాగా తెలుగు మీడియాను కలిసిన సందర్భంగా తన టూర్ వివరాలు తెలిపాడు.

భూటాన్ గురించి తాను చాలా విన్నానని.. ఆసియాలోనే అత్యంత అందమైన, ప్రశాంతమైన దేశం అదని తెలిసిందని.. అక్కడ చాలా విశేషాలున్నాయని.. అక్కడికి వెళ్లాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని.. ఇప్పటికి కుదిరిందని రాజమౌళి తెలిపాడు. ఆ టూర్ ముగిశాక కూడా మొత్తంగా రెండు నెలల పాటు సినిమా ఆలోచనలేమీ పెట్టుకోనని.. కుటుంబంతోనే సంతోషంగా గడుపుతానని.. ఆ తర్వాత తన తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తానని రాజమౌళి అన్నాడు. తన తర్వాతి సినిమాకు కథ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదని.. తన తండ్రి చాలా కథలు రాశాడని.. తనలో ఎమోషన్ కలిగించే కథను ఎంచుకుంటానని.. ఐతే ఈసారి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటివేమీ లేకుండా ఒక మామూలు కథను తెరకెక్కించాలని ఉందని జక్కన్న చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు