'సాహో' టీజర్ లీకైపోయింది

'సాహో' టీజర్ లీకైపోయింది

ప్రభాస్ అభిమానులు 'బాహుబలి: ది బిగినింగ్' సినిమా కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో.. ఆ చిత్రంతో పాటు ప్రదర్శితం కాబోయే 'సాహో' టీజర్ కోసం కూడా అంతే ఆసక్తితో ఉన్నారు. ఇప్పటిదాకా ఈ టీజర్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అది ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతోంది.

ఐతే ఇంతలో అనూహ్యంగా 'సాహో' టీజర్ లీకైపోయింది. ఇది ఎలా జరిగింది ఏంటి అన్నది తెలియడం లేదు కానీ.. ఆల్రెడీ సోషల్ మీడియాలో 'సాహో' టీజర్ హల్ చల్ చేస్తోంది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

సాహో టీజర్ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా వచ్చేసింది. ఇది పక్కా యాక్షన్ టీజర్ అంటున్నారు చూసినవాళ్లు. ప్రభాస్ రక్తపు మడుగులోంచి బయటికి రావడంతో మొదలవుతుందట టీజర్. ఐతే రౌడీలు ప్రభాస్ ను కొట్టారేమో అని విలన్ అనుకుంటాడట. కానీ ప్రభాసే రౌడీ గ్యాంగును ఉతికారేసి.. రక్తపు మడుగు నుంచి బయటికి వస్తాడట. ఓ పంచ్ లైన్ తో ఈ టీజర్ ముగుస్తుందని అంటున్నారు.

టీజర్ అంచనాలకు తగ్గట్లే తీర్చిదిద్దారని.. ప్రభాస్ అభిమానుల్ని ఇది అలరిస్తుందని అంటున్నారు. టీజర్ లీక్ అయిపోయిన నేపథ్యంలో 'బాహుబలి-2' విడుదలకు ముందు రోజే అఫీషియల్‌‌గా యూట్యూబ్‌ లో ఈ టీజర్ ను లాంచ్ చేయాలని 'సాహో' టీం భావిస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు