మతులు పోగొడుతోన్న బాహుబలి

మతులు పోగొడుతోన్న బాహుబలి

బాహుబలి 2 చిత్రం కోసం జనం వెర్రిగా ఎదురు చూస్తున్నారనేది అరదరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఎదురు చూపులు ఏ స్థాయిలో వున్నాయనేది ఎవరూ ఇంతవరకు అంచనా వేయలేకపోయారు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ చేస్తే కానీ దీనికున్న క్రేజ్‌ ఏంటనే దానికి లెక్క తెలీడం లేదు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అప్పుడే బాహుబలికి లక్ష అడ్మిషన్లు వచ్చాయట. ఉదాహరణకి చెప్పుకోవాలంటే హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 8' కంటే ఇది చాలా ఎక్కువట. అన్ని భాషలకి చెందిన వారు చూసే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రానికి వచ్చిన దానికంటే ఒక భారతీయ ప్రాంతీయ భాషా చిత్రానికి ఎక్కువ అడ్మిషన్లు రావడాన్ని ఒక అద్భుతంగా యుఎఈ ట్రేడ్‌ చెప్పుకుంటోంది.

మొదటి రోజే ఇక్క అయిదు కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు ఖాయమని అంటోంది. పెద్ద హిట్‌ అయిన తెలుగు సినిమాలకి కూడా ఫుల్‌ రన్‌లో ఇంత గ్రాస్‌ రాదక్కడ. దీనిని బట్టి బాహుబలి రచ్చ ఏ స్థాయిలో వుందనేది మీరే అంచనా వేసుకోండి. దేశం అవతల పరిస్థితి ఇలాగుంటే ఇక దేశం లోపల అయితే టికెట్‌ అనేది కౌంటర్‌కి కానీ, బుకింగ్‌ వెబ్‌సైట్లకి కానీ చేరడం లేదు. అన్నీ రికమండేషన్‌ టికెట్ల రూపంలో ముందే వెళ్లిపోతున్నాయి.

ప్రతి ఊళ్లో వున్న అన్ని థియేటర్లలో సినిమా విడుదలవుతున్నా, చూడాలనుకున్న వారందరికీ మొదటి రోజు టికెట్లు దక్కేలా కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు