తమ్ముడి కోసం రంగంలోకి రామ్‌ చరణ్‌

తమ్ముడి కోసం రంగంలోకి రామ్‌ చరణ్‌

వరుణ్‌ తేజ్‌ని వరుస పరాజయాలు వేధిస్తూ వుండడంతో ఒకింత నిరాశకి గురయ్యాడట. పేరున్న దర్శకులనే నమ్ముకున్నా తనకి మంచి విజయాన్ని ఇవ్వలేకపోతున్నారని బాగా డీలా పడ్డాడట. ముఖ్యంగా మిస్టర్‌ పరాజయం వరుణ్‌ని తీవ్రంగా కృంగదీసిందట.

ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న వరుణ్‌ తేజ్‌ ఈస్థాయి తిరస్కారం అసలు ఊహించలేదట. పెట్టిన పెట్టుబడిలో మూడు వంతులకి పైగా పోయిన అతి పెద్ద పరాజయంగా రికార్డులకెక్కిన మిస్టర్‌తో డిప్రెస్‌ అయిన వరుణ్‌ తేజ్‌కి ఒక మంచి ప్రాజెక్ట్‌ సెట్‌ చేసే బాధ్యత చరణ్‌ తీసుకున్నాడని టాక్‌ వినిపిస్తోంది. వరుణ్‌కి ఖచ్చితంగా ఒక పెద్ద హిట్‌ ప్రాజెక్ట్‌ని సెట్‌ చేస్తానని నాగబాబుకి చరణ్‌ మాటిచ్చాడట.

అన్నీ కుదిరితే కొణిదెల ప్రొడక్షన్స్‌ మీదే వరుణ్‌తో సినిమా తీయాలని చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఈ బ్యానర్‌ ద్వారా కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేయాలని చరణ్‌ భావిస్తున్నాడు. తనతో పని చేసే దర్శకుల వద్ద అసిస్టెంట్స్‌గా చేస్తోన్న వారిలో ఎవరైనా టాలెంటెడ్‌ వున్నారేమో అని చరణ్‌ ఆరా తీస్తున్నాడట.

అలాగే స్టార్‌ డైరెక్టర్స్‌తో ఎక్స్‌పెరిమెంటల్‌గా మీడియం బడ్జెట్‌ చిత్రాలు చేయాలని కూడా చరణ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. మరి వరుణ్‌ తేజ్‌తో ప్రాజెక్ట్‌కి చరణ్‌ ఎవరిని సెట్‌ చేస్తాడో కానీ అన్నదమ్ముల నుంచి వచ్చే చిత్రమంటే ఖచ్చితంగా ఫాన్స్‌కి ఊపునిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు