రాజమౌళి ఎందుకంత ఎమోషనల్ అయ్యాడంటే..

రాజమౌళి ఎందుకంత ఎమోషనల్ అయ్యాడంటే..

రాజమౌళిని దశాబ్దంన్నరగా చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. తన సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్టవుతున్నపుడు కానీ.. ఇంకేదైనా సందర్భాల్లో కానీ.. అతను ఓవర్ ఎగ్జైట్ అయిన.. ఎమోషనల్‌గా కనిపించిన సందర్భాలు దాదాపుగా లేనట్లే. కానీ 'బాహుబలి: ది కంక్లూజన్' ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం అందరికీ భిన్నమైన రాజమౌళి కనిపించాడు.

ఆ రోజు కీరవాణి తన గురించి పాడిన పాట విని.. చాలా ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. రాజమౌళిని అలా చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు ఆ రోజు. మరి ఎప్పుడూ తొణకకుండా ఉండే రాజమౌళి.. ఎప్పుడూ తనతోనే ఉండే తన అన్నయ్య పాడిన పాటకు అంత ఎమోషనల్ ఎందుకయ్యాడు..? దీనిపై రాజమౌళి స్పందనేంటో తెలుసుకుందాం పదండి.

''ఆ పాట గురించి నిజంగా నాకు అంతకు ముందు వరకు తెలియదు. ఎప్పుడూ అన్నయ్యతోనే ఉంటా కాబట్టి ఆయన నా గురించి అలా పాట రాసుకుని వస్తారని.. నా గురించి అలా పాడతారని అస్సలు ఊహించలేదు. నా గురించి అలా లిరిక్స్ మొదలవడం.. అమ్మ ప్రస్తావన కూడా రావడంతో ఎమోషనల్ అయిపోయా. కన్నీళ్లు తన్నుకొచ్చేశాయి. కానీ అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు.

ఆనంద భాష్పాలే. ఐతే నేను ఎమోషనల్ అవ్వగానే నాకంతా బ్లాంక్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతోందో ఇంకేమీ అర్థం కాలేదు. అన్నయ్య తర్వాత ఏం పాడాడో కూడా వినిపించుకోలేదు. లిరిక్స్ కూడా పూర్తిగా వినలేదు. తర్వాతి ఇంటికెళ్లి అన్నయ్య ఏం రాశాడా అని అందరం కలిసి చూసుకున్నాం" అని రాజమౌళి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు