చిరు సినిమా ఎప్పుడో చ‌ర‌ణ్ చెప్పాడు

చిరు సినిమా ఎప్పుడో చ‌ర‌ణ్ చెప్పాడు

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబ‌ర్ 150' విడుద‌లై 100 రోజులు దాటిపోయింది. చిరు త‌ర్వాతి సినిమా గురించి పూర్తి స్ప‌ష్ట‌త రాలేదు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో చిరు త‌ర్వాతి సినిమా ఉంటుంద‌న్న స‌మాచారం పాతదే కానీ.. ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది.. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ ఏ ద‌శ‌లో ఉంది.. మిగ‌తా విశేషాల‌పై అధికారిక స‌మాచారం ఏమీ లేదు.

చిరు కానీ.. మ‌రెవ్వ‌రు కానీ ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డం మెగా అభిమానుల్ని నిరాశ‌కు గురి చేస్తోంది. ఇలాంటి త‌రుణంలో చ‌ర‌ణ్ త‌న తండ్రి 151వ సినిమా గురించి స్పందించాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తాను చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ స్పాట్ ద‌గ్గ‌రికి వ‌చ్చిన అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. చిరు సినిమాతో పాటు త‌న సినిమా ముచ్చ‌ట్లు కూడా పంచుకున్నాడు.

"నాన్న గారి 150వ సినిమా ఘ‌న విజ‌యం సాధించడానికి కార‌ణం అభిమానులే. 151వ సినిమా ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది. ఇంత వ‌రకూ ఆయ‌న ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. నాన్న ఓ గొప్ప పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జ‌ర‌గ‌నుంది. క‌చ్ఛితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అలాగే నా 'ధృవ' సినిమా కూడా పెద్ద హిట్ అయింది. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఎండ‌ల్ని సైతం లెక్క చేయ‌కుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. బాబాయ్ ఏం చేసినా ఆయ‌న వెన్నంటే ఉండాలి.

రాజ‌కీయ ప‌రంగానైనా..ఇంకేదైనా. మేం ఇంత ఎత్తుకు ఎదిగామంటే కార‌ణం మీరే. నేను హైద‌రాబాద్ లో ఉండి సినిమా షూటింగ్ చేసుకోవ‌చ్చు. ఎంత‌టి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులున్న‌ప్ప‌టికీమిమ్మ‌ల్ని అల‌రించాలనే ఉద్దేశంతోనే  సినిమా షూటింగ్ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నాం. నా సినిమా విష‌యానికి వ‌స్తే .. సుకుమార్ చాలా మంచి క‌థ చెప్పారు. క‌థ‌, క‌థ‌నాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. అందుకే సినిమాకు క‌మిటయ్యా. మీ అంద‌ర్నీ అల‌రించే విధంగా సినిమా ఉంటుంది" అని చ‌ర‌ణ్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు