సుకుమార్‌ ససేమీరా... షూటింగ్‌ జరుగుతుందా?

సుకుమార్‌ ససేమీరా... షూటింగ్‌ జరుగుతుందా?

కోస్తా ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా వుండడంతో త్వరగా షెడ్యూల్‌ ముగించుకుని వచ్చేసిన రామ్‌ చరణ్‌ తదుపరి చిత్ర బృందం మళ్లీ మే నెలలో అక్కడికే షూటింగ్‌ కోసం వెళ్లాల్సి వుంటుంది. అయితే ఎండాకాలం అయిపోయే వరకు అక్కడ పరిస్థితులు ఇలాగే వుంటాయి కనుక లొకేషన్‌ మార్చాలని సుకుమార్‌ని కోరారట.

రాజమండ్రిని తలపించే ఊళ్లు చాలానే వుంటాయి కనుక, కాస్త చల్లగా వుండే ప్రాంతంలో షూటింగ్‌ పెట్టుకుందామని సూచించారట. అయితే ఈ చిత్రాన్ని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే తీయాలని, వేరే ప్రాంతంలో షూటింగ్‌ చేస్తే సహజత్వం లోపిస్తుందని సుకుమార్‌ అన్నాడట.

దర్శకుడిగా అతని మాటే ఫైనల్‌ కనుక షూటింగ్‌ వేరే ప్రాంతానికి షిఫ్ట్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మే నెలకి వేసవి తాపం ముదిరినట్టయితే అసలు ఆ షెడ్యూల్‌ వుంటుందో లేదో అని కూడా అంటున్నారు. దసరాకి విడుదల చేద్దామని ప్లాన్‌ చేస్తోన్న ఈ చిత్రానికి ఇంతవరకు పట్టుమని ఇరవై రోజుల షూటింగ్‌ జరగలేదు.

సుకుమార్‌ కనుక కోస్తా నుంచి కదిలి రావడానికి ఒప్పుకోనట్టయితే దసరా సమయానికి సినిమా రెడీ అవుతుందా అనేది కూడా అనుమానమేనని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు