వాట్స‌ప్‌లో వైర‌ల్ గా కానిస్టేబుల్ లీవ్ లెట‌ర్‌

వాట్స‌ప్‌లో వైర‌ల్ గా కానిస్టేబుల్ లీవ్ లెట‌ర్‌

బాహుబ‌లి 2కి ఎంత క్రేజ్ ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురుచూస్తున్న వారు వేలాది మంది ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడు చూద్దామా?  అని తెగ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మామూలుగా ఎప్పుడో కానీ సినిమాలు చూసే వారు సైతం.. బాహుబ‌లి 2ను మాత్రం మొద‌టి రెండు రోజుల్లోనే చూడాల‌ని ఫిక్స్ కావ‌టం చూస్తే.. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న సినిమా విడుద‌ల మ‌రో రెండు రోజుల్లో రానున్న వేళ‌లో.. ఈసినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఈ సినిమాను మొద‌టి రోజు మొద‌టి ఆట‌నే చూడాల‌ని అనుకుంటున్న వారు ల‌క్ష‌ల్లో ఉన్నారు. అయితే.. వారంద‌రి ఆరాటం కంటే.. తాజాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ప‌డుతున్న ఆరాటం అంద‌రిదృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేష‌న్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ రాసిన లీవ్ లెట‌ర్ అంటూ.. ఒకటి వాట్స‌ప్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌కు తాను బాహుబ‌లి మూవీని చూడాల‌ని అనుకుంటున్నాన‌ని.. అందులో భాగంగా ఈ నెల 28న త‌న‌కు సెల‌వు ఇప్పించాల్సిందిగా కోర‌టం విశేషంగా మారింది.

సెల‌వు అడ‌గాలంటే చాలానే కార‌ణాలు చూపించే అవ‌కాశం ఉన్నా.. నిజాయితీగా ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పాల‌నుకున్నారో.. లేక‌.. దీన్ని వైర‌ల్ చేయ‌టానికి పుట్టించారో ఇంకా స్ప‌ష్ట‌త రావ‌ట్లేదు.

లీవ్ లెట‌ర్‌లో కంటెంట్ చూస్తే.. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాల‌ని బాహుబ‌లి 1 చూసిన‌ప్ప‌టి నుంచి సందేహంలో ఉన్నాన‌ని.. ఇందులో భాగంగా గ‌డిచిన రెండేళ్లుగా డ్యూటీ మీద కాన్సంట్రేష‌న్ చేయ‌లేక‌పోతున్నాన‌ని.. ఆ విష‌యం తెలుసుకునేందుకు సినిమా విడుద‌ల కానున్న రోజున త‌న‌కు సెల‌వు ఇప్పించాల్సిందిగా కోరిన లీవ్ లెట‌ర్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. లీవ్ లెట‌ర్ రాసిన కానిస్టేబుల్ పేరు విజ‌య‌కుమార్ అని.. త‌న స‌ర్వీసు నెంబ‌రు 1511గా పేర్కొన్నారు. ఈ లీవ్ లెట‌ర్ నిజ‌మా? కాదా?  అన్న‌ది తేల‌కున్నా.. ఈ లీవ్ లెట‌ర్ మాత్రం ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English