ఎంత కష్టపడినా, కాపీ కాపీయే!

ఎంత కష్టపడినా, కాపీ కాపీయే!

చాలా కష్టపడి తెలుగు సినిమాలు తీస్తున్న తెలుగు దర్శకులు, చివరకు కాపీ క్యాట్స్‌ అంటూ ఆడియన్స్‌ చేత మొట్టికాయలు వేయించుకుంటున్నారు. అయినాసరే మనోళ్ళు మాత్రం మేము చాలా కష్టపడి సినిమాను తీశాం అంటూ గొప్పలుపోతున్నారు.

ఈ మధ్యనే వచ్చిన గ్రీకువీరుడు, సుకుమారుడు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా వర్కవుట్‌ కాలేదు కాని, రెండు సినిమాల కథలూ ఒకే ఇంగ్లీష్‌ మూవి నుండి కాపీ కొట్టారు. హాలీవుడ్‌లో రిడ్లీ స్కాట్‌ దర్శకత్వంలో వచ్చిన  'ఏ గుడ్‌ ఇయర్‌' అనే సినిమాను ఆధారంగా తీసుకొని మనోళ్ళు రెండు స్టోరీలను తీశారు.కాస్త కాపీ కొట్టేసిన దశరథ్‌ దానిని గ్రీకువీరుడు అనేస్తే, ఫుల్‌గా కాపీ కొట్టిన అశోక్‌ దానిని సుకుమారుడు అన్నాడు.

అయితే మనోళ్ళు ఇలా అనువదించడానికి, మన కల్చర్‌కు అడాప్ట్‌ చెయ్యడానికీ చాలా కష్టపడినా, కాపీ సినిమా కాపీ సినిమానే. కాని ఈ రెండింటిలో ఒకటి కూడా విజయం దిశగా వెళ్ళకపోవడం అనేది వీళ్ల దురదృష్టకరం. ఈసారైనా కాస్త ఒరిజనల్‌ కథలు తీసుకొని సినిమాలు తియ్యండి బాసు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు