రాజమౌళి హోటల్లో ఉన్నా ఆ దుప్పట్లే

రాజమౌళి హోటల్లో ఉన్నా ఆ దుప్పట్లే

సినిమా షూటింగ్ అన్నాక కొన్ని రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండక తప్పదు. ఐతే అది రోజులు మాత్రమే అయితే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. కానీ నెలలు.. సంవత్సరాల తరబడి ఇంటికి దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ.. తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడే రాజమౌళి లాంటి దర్శకులకు ఇంటికి దూరంగా ఉండటం ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు.

అందుకే రాజమౌళి ఎక్కడుంటే అక్కడే అతడి సొంత ఇల్లు రెడీ అయిపోతుందట. హోటల్లో ఉన్నా కూడా ఇది మన ఇల్లే అన్న ఫీలింగ్ కలిగించేలా అక్కడ ఏర్పాట్లు జరిగిపోతాయట. ఈ సంగతేంటో రాజమౌళి భార్య రమ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

''బాహుబలి సినిమా కోసం మా కుటుంబం అంతా నాలుగైదేళ్లకు పైగా సమయాన్ని అంకితం చేసింది. ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండక తప్పలేదు. అందుకే మేం ఎక్కడ ఉంటే అక్కడే ఇంటి వాతావరణం గుర్తుకొచ్చేలా మార్చేశాం. అలా లేకపోతే ఇది హోటల్.. ఇది పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరిగే ల్యాబ్.. ఇది షూటింగ్‌ స్పాట్‌ అన్న ఫీలింగ్‌ మనసులో ఉండిపోతుంది. రాజమౌళికి ఇల్లంటే ఇష్టం.

బయట ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే.. అది ఎంత పెద్ద స్టార్‌ హోటల్‌ అయినా అక్కడి మంచాల మీద మా దుప్పట్లు వేస్తాను. వేరే బెడ్‌షీట్ల మీద రాజమౌళికి నిద్ర పట్టదు. 'బాహుబలి' షూటింగ్ జరిగినన్నాళ్లూ రామోజీ ఫిలిం సిటీనే మాకు ఇల్లయింది. అక్కడ ఓ గెస్ట్‌ హౌస్‌ను ఇంటిలాగా మార్చేశాం. మా ఇంట్లో పని చేసేవాళ్లనే అక్కడ పెట్టేశాం. నేనే వంట చేసేదాన్ని'' అని రమ తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు