కలర్స్‌ స్వాతి ఏమైపోయింది?

కలర్స్‌ స్వాతి ఏమైపోయింది?

త్రిపుర తర్వాత కలర్స్‌ స్వాతి తెలుగు చిత్ర పరిశ్రమలో కానరావడం లేదు. కార్తికేయతో విజయం సాధించిన తర్వాత స్వాతి త్రిపురపై చాలా నమ్మకం పెట్టుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు విజయం సాధిస్తోన్న ట్రెండ్‌లో చేసిన త్రిపుర ఫ్లాప్‌ అవడంతో స్వాతికి రెగ్యులర్‌గా వచ్చే బబ్లీ గాళ్‌ పాత్రలు కూడా రాకుండా పోయాయి.

త్రిపుర తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించని స్వాతి ప్రస్తుతం చెన్నయ్‌లో సెటిలైంది. తమిళంలో ఆమె ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. సుబ్రమణ్యపురం తో తమిళనాడులోను పాపులర్‌ అయిన స్వాతికి ఇప్పుడు చేతిలో వున్న సినిమాలేమీ పెద్ద చెప్పుకోతగ్గవి కాదు కానీ ప్రస్తుతానికి బండి నడుస్తోంది.

ఆమధ్య పెళ్లి పుకార్లు వస్తే కొట్టి పారేసిన స్వాతి మళ్లీ తనకి తగ్గ పాత్రలు వస్తాయనే ఎదురు చూస్తోంది. అయితే టాలీవుడ్‌ ఈ అష్టాచమ్మా హీరోయిన్‌ని పూర్తిగా మర్చిపోయినట్టుంది. చాలా మంది అచ్చతెలుగు హీరోయిన్లలానే ఇప్పుడు స్వాతి కూడా పక్క రాష్ట్రాల నుంచి వస్తోన్న అవకాశాలతోనే కాలం గడుపుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు