హన్సిక రౌడీయిజం!

 హన్సిక రౌడీయిజం!

పాలబుగ్గల చిన్నది  హన్సిక రౌడీయిజం చెలాయిస్తోంది. సినిమా ఎలా విడుదల చేసుకుంటారో నేనూ చూస్తా అంటూ నిర్మాతలను భయపెడుతోంది. ఫిలిం ఛాంబర్ వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది.

అసలు విషయం ఏమిటంటే... ఈ ముద్దుగుమ్మ నాలుగైదేళ్ళ క్రితం తెలుగులో `సీతారాముల కళ్యాణం లంకలో` అనే సినిమా చేసింది. అందులో నితిన్ కథానాయకుడు. ఈశ్వర్ దర్శకత్వం వహించారు. తెలుగులో పరాజయాన్ని చవిచూసిన ఈ సినిమాని ఇప్పుడు తమిళంలో అనువదించి విడుదల చేసేందుకు ఓ నిర్మాత సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ విషయం హన్సిక చెవిన పడింది. నిర్మాతలపై అగ్గిమీద గుగ్గిలమైంది. నేను నటించిన సినిమాని నాకు తెలియకుండా ఎలా విడుదల చేస్తున్నారని ప్రశ్నించింది.  `తెలుగులో ఇదొక ఫ్లాప్ సినిమా. తమిళంలో నాకున్న ఫేం ని క్యాష్ చేసుకుందామనే దురుద్దేశంతోనే  ఇలాంటి సినిమాని విడుదల చేస్తున్నారు` అని దక్షిణ భారత చలచిత్ర పరిశ్రమకు ఫిర్యాదు చేసిందట. హన్సికనా మజాకా మరీ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English