కాటమరాయుడు బయ్యర్లతో డీల్ కుదిరిందా?

కాటమరాయుడు బయ్యర్లతో డీల్ కుదిరిందా?

'సర్దార్ గబ్బర్ సింగ్' అంచనాల్ని అందుకోవడంలో ఘోరంగా విఫలమై.. ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెట్టిన బయ్యర్లను నిలువునా ముంచేసింది. ఐతే 'కాటమరాయుడు' సినిమాను మళ్లీ అదే బయ్యర్లకు ఇస్తామన్న హామీతో దీనిపై అప్పటికి వివాదం చెలరేగకుండా చూసుకున్నారు. కానీ 'కాటమరాయుడు'కు మంచి హైప్ వచ్చి.. దాన్ని వేరే బయ్యర్లకు అమ్మడంతో వివాదం రాజుకుంది.

ఒక డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్షకు దిగినా.. పవన్ అండ్ కో పట్టించుకోలేదు. 'సర్దార్' బాధిత బయ్యర్లు ఒకటికి రెండు ప్రెస్ మీట్లు పెట్టినా ఫలితం లేకపోయింది. మరోవైపు 'కాటమరాయుడు' కూడా అంచనాల్ని అందుకోవడంలో విఫలమై.. భారీగానే బయ్యర్లను ముంచింది. కనీసం రూ.25 కోట్ల దాకా ఈ సినిమా నష్టం తెచ్చిపెట్టింది. దీంతో 'సర్దార్' బాధితులకు.. కాటమరాయుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా కలుస్తారని.. అందరూ కలిసి ఆందోళనకు దిగుతారని.. పవన్, శరత్ మరార్‌లకు తలపోటు తప్పదని అంతా అనుకున్నారు. కానీ 'కాటమరాయుడు' కథ ముగిసినా.. ఎలాంటి ఆందోళనలు చెలరేగలేదు. ఈ విషయంలో బయ్యర్లను ముందే మేనేజ్ చేశారో ఏంటో తెలియదు.

ఈ సినిమా బయ్యర్లను కూడా పవన్, మరార్ పట్టించుకోకుంటే పరిణామాలు మామూలుగా ఉండకపోవచ్చు. బయ్యర్లందరూ ఒక్కటై.. ఇద్దరు మిత్రుల్ని టార్గెట్ చేసే అవకాశముంది. పవన్ తర్వాతి సినిమాకు అది కచ్చితంగా తలపోటుగా మారుతుంది. మరి డిస్ట్రిబ్యూటర్లతో ముందే ఏదైనా డీల్ జరిగి.. వాళ్ల వాయిస్ బయటికి రాకుండా మేనేజ్ చేశారేమో తెలియదు. అలాంటిదేమీ లేకుంటే మాత్రం 'సర్దార్' బాధితుల్లాగే.. 'కాటమరాయుడు' డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళన బాట పట్టి.. పవన్, మరార్‌లను టార్గెట్ చేయడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు