శ్రీను వైట్ల ఇల్లు అమ్మేసుకున్నాడా?

శ్రీను వైట్ల ఇల్లు అమ్మేసుకున్నాడా?

'మిస్టర్‌' పేరు చెప్పి శ్రీను వైట్లకి పైసా పారితోషికం రాకపోగా, ఎదురు తన ఫ్లాట్‌నే కోల్పోయాడనే పుకారు గట్టిగా వినిపిస్తోంది. మామూలుగా పది కోట్ల పారితోషికం తీసుకునే శ్రీను వైట్ల 'మిస్టర్‌' ముందు వచ్చిన రెండు డిజాస్టర్స్‌ వల్ల ఈ చిత్రానికి పారితోషికం అంటూ ఏదీ తీసుకోలేదట.

తన వాటాగా ఆంధ్ర ఏరియాలోని మూడు జిల్లాల పంపిణీ హక్కులని మాత్రం తీసుకున్నాడట. అయితే సినిమా నిర్మాణం కనుక ఇరవై కోట్ల లోపులో పూర్తి చేయకపోతే, పైన అయ్యే ఖర్చంతా తనదే బాధ్యత అని కూడా ఒప్పంద పత్రంపై సంతకం చేసాడట. అనుకున్న దానికంటే బడ్జెట్‌ ఎక్కువ అవడంతో, తను తీసుకున్న జిల్లాలకి వచ్చిన అడ్వాన్స్‌తో పాటు, తన సొంత ఫ్లాట్‌ ఒకటి అమ్మి పెట్టుబడి పెట్టాడట.

అయితే మిస్టర్‌ చిత్రానికి బయ్యర్లు ఇచ్చిన అడ్వాన్సులకి తగ్గ కలక్షన్లు కూడా రాకపోవడంతో ఇక బ్యాలెన్స్‌ వచ్చే అవకాశాలు లేవంటున్నారు. దీంతో వైట్ల ఈ చిత్రంపై పెట్టినదంతా లాస్‌ అయిపోయాడని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా హిట్‌ కొట్టాలనే కసితో శ్రీను వైట్ల చేసిన ఈ ప్రయత్నం ఈస్థాయిలో బెడిసికొడుతుందని అతను ఊహించి వుండడు. గత రెండు చిత్రాలు ఫ్లాప్‌ అయినప్పటికీ శ్రీను వైట్లకి పారితోషికం మాత్రం ఫుల్‌గా వచ్చేసింది.

మిస్టర్‌కి తన చేతికి డబ్బులేం రాకపోగా, సొంతిల్లు పోగొట్టుకున్నాడంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. విడుదలకి ముందు మీడియాలో బాగానే కనిపించిన వైట్ల ఫ్లాప్‌ అయిన తర్వాత మాత్రం మీడియాలో కనిపించనే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు